గత కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియాలో అల్లు అర్జున్ వర్సెస్ పవన్ కళ్యాణ్ అన్నట్లుగా ఫ్యాన్ వార్ న‌డుస్తోంది. నిజానికి ఈ ఇద్దరు హీరోలు మెగా ఫ్యామిలీ నుంచే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. కానీ ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు పవన్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ను విడతీశాయి. ఇదిలా ఉంటే.. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన `హరిహర వీరమల్లు` చిత్రం నేడు భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయిన సంగ‌తి తెలిసిందే.


పవన్ నటించిన తొలి పీరియాడిక్ డ్రామా ఇది. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన హరిహర వీరమల్లు మూవీకి మెజారిటీ ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ లభిస్తుంది. పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో చేశాడని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అయితే సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఒక్క‌ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. అదే విషయం బ‌న్నీ ఫాన్స్ ను కృషి చేయడం గమన్నారం.


మామూలుగా పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే ఇతర హీరోల రికార్డులు డేంజ‌ర్ జోన్‌లో ప‌డ‌టం ఖాయం. అందులో భాగంగానే ఈసారి అల్లు అర్జున్ పేరిట ఉన్న రికార్డుపై పవన్ ఫ్యాన్స్ కన్నేశారు. కానీ చివరకు నిరాశే ఎదురయింది. పెయిడ్ ప్రీమియ‌ర్స్ విష‌యంలో అల్లు అర్జున్ యాక్ట్ చేసిన `పుష్ప 2 ది రూల్‌` టాప్ ప్లేస్ లో ఉంది. గ‌త ఏడాది డిసెంబ‌ర్ 5న ఈ సినిమా రిలీజ్ కాగా.. ఒక రోజు ముందే అన‌గా డిసెంబ‌ర్ 4న నైట్ తెలుగు రాష్ట్రాల‌తో పాటు యూకే, యూస్ స‌హా ప‌లు ప్రాంతాల్లో ప్రీమియ‌ర్ షోలు ప‌డ్డాయి. ఇండియా వైడ్‌గా 640 షోలు వేయ‌గా.. రూ. 14.44 కోట్ల క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. అందులో రూ. 13.03 కోట్లు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే వ‌చ్చాయి.


ఇక తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లోని పలు ప్రాంతాల్లో హరిహర వీరమల్లు పెయిడ్ ప్రీమియర్స్, బెనిఫిట్ షోలు జూలై 23నే పడ్డాయి. అయితే ఇండియా వైడ్‌ గా 737 షోలకు గాను రూ. 12.93 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ఇందులో రూ. 12.13 కోట్లు అడ్వాన్స్ బుకింగ్స్ కింద వచ్చినవి. మొత్తంగా పుష్ప 2 పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేయ‌డంలో వీర‌మ‌ల్లు తృటిలో మిస్ చేసుకున్నాడు. దీంతో ప‌వ‌న్ ఫ్యాన్స్ హ‌ర్ట్ అవ్వ‌గా.. త‌మ హీరో రికార్డ్ సేఫ్‌గా ఉండ‌టంతో బ‌న్నీ ఫ్యాన్స్ సంబ‌ర‌ప‌డిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: