పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఏ సినిమా విడుదలైనా సరే దాని గురించి కొన్ని పాజిటివ్ కొన్ని నెగిటివ్ కామెంట్లు వినిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా చరిత్రకు సంబంధించి పురాణానికి సంబంధించి సినిమాలు తీస్తే అన్ని చూసుకొని తీయాలి. అందులో ఏ చిన్న తప్పు చూపించినా కూడా జనాలు అస్సలు ఒప్పుకోరు.దానిలో ఉన్న నెగిటివ్ పాయింట్లు ఎత్తి చూపుతుంటారు. అయితే తాజాగా విడుదలైన హరిహర వీరమల్లు మూవీ చరిత్రకారులకు సంబంధించింది అని చరిత్రను అద్భుతంగా తీసి చూపించారు అంటూ మాట్లాడుకుంటున్నారు. అయితే తాజాగా హరిహర వీరమల్లు మూవీ గురించి ఆంధ్రప్రదేశ్ సిపిఎం నేత శ్రీనివాసరావు సంచలన మాట్లాడుతూ.. అసలు చరిత్రలో వీరమల్లు లేడు.

 కేవలం ముస్లిం, హిందూ మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టడం కోసమే పవన్ కళ్యాణ్ ఆర్ఎస్ఎస్ మతంలో పూర్తిగా చేరి ఇలాంటి సినిమా తీశారు.. మొగల్ చక్రవర్తుల్లో చాలామంది మంచి వాళ్ళు కూడా ఉన్నారు. అందులో చివరి మొగల్ చక్రవర్తి బ్రిటిష్ వారితో యుద్ధం కూడా చేశారు. కానీ వాళ్ళ గురించి చూపించలేదు.పవన్ కళ్యాణ్ లాంటి బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న వాళ్లు ఇలా చరిత్రను వక్రీకరించి చూపించవచ్చా.. హరిహర వీరమల్లు  చారిత్రక సినిమాని అంటున్నారు.కానీ అందులో అసలు చరిత్రనే లేదు.ఈ సినిమా వేసే ముందే కల్పిత కథ అని వెయ్యాలి కానీ అలా చేయలేదు.. మొగులులు, వజ్రం ఆధారంగా చేసుకొని హరిహర వీరమల్లు కథ తీశారు.

ముఖ్యంగా ఇది ముస్లింలను వ్యతిరేకించే సినిమా. ఈ సినిమా వల్ల మళ్ళీ ముస్లిం,హిందువుల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టడమే పవన్ కళ్యాణ్ లక్ష్యం. మొగులుల అరాచకాలు చూపించారు కానీ వాళ్ళ సంపద అంతా ఇక్కడే ఉంది అది చూపించలేదు.. పవన్ కళ్యాణ్ అంతలా కోహినూర్ వజ్రం గురించి సినిమా తీశారు కాబట్టి మోడీని సంప్రదించి ఆయన పలుకుబడితో లండన్ లో ఉన్న కోహినూర్ వజ్రాన్ని ఇక్కడికి తీసుకురాగలరా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే సిపిఐ నేత వ్యాఖ్యలపై చాలామంది రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నారు.

ముఖ్యంగా సిపిఐ అంటేనే చైనా,రష్యా వంటి దేశాలే వాళ్లకు గుర్తుకు వస్తాయని, హిందూ అనేది కూడా వాళ్లకు నచ్చదని.. అందుకే పవన్ కళ్యాణ్ పై పగబట్టి ఇలాంటి మాటలు మాట్లాడారని విమర్శిస్తున్నారు. వామపక్షాలన్నీ కలిసి పవన్ సినిమాపై పగ బట్టారంటూ మాట్లాడుతున్నారు.అయితే పవన్ కళ్యాణ్ తన సినిమాకి ముందు సనాతన ధర్మం గురించి మాట్లాడి ఆనాడు హిందువులు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనే మాటలు మాట్లాడడం వల్ల కొన్ని వామపక్షాలు పవన్ కళ్యాణ్ సినిమాపై పగబట్టినట్టు మాట్లాడుతున్నాయి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: