
ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి గ్యాప్ లేకుండా బాలయ్య – బోయపాటి టీమ్ నిరంతరం పనిచేస్తోంది. అందుకే రిలీజ్ డేట్ ను స్ట్రిక్ట్‌గా పట్టుకుని సెప్టెంబర్ 25న థియేటర్లలో పండగ చేయేందుకు ఫిక్స్ అయ్యారు. ఈ తేదీకి ఎన్ని సినిమాలు పోటీగా వచ్చినా బాలయ్య మాత్రం “తగ్గేదేలే!” అంటూనే బరిలోకి దిగుతున్నాడు. ఇక ఈసారి సినిమాకు విజువల్స్ పరంగా గట్టిగా ఫోకస్ పెట్టారు. సీజీ, విఎఫ్‌ఎక్స్ వర్క్ ఇప్పటికే చివరి దశలో ఉంది. యాక్షన్ బ్లాక్స్‌కు అసలు హైలైట్ ఇదే కావచ్చు. బోయపాటి ప్రత్యేక బృందంతో ఈ పనులను ముందుగానే స్టార్ట్ చేయించి, సమాంతరంగా షూటింగ్‌తో పాటు కంప్లీట్ చేయిస్తున్నారు.
మరోవైపు థమన్ అందిస్తున్న బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గురించి మేకర్స్ నుంచి ఇప్పటికే మాస్ అలర్ట్ వచ్చింది. “ఈసారి థియేటర్ గోడలు కొట్టుకుంటాయ్” అంటూ థమన్ ఘంటాపథంగా చెప్పాడట. దబిడి దిబిడి మాస్ రేంజ్‌లో బీజీఎమ్ ఇవ్వాలని, బాలయ్య ఎంట్రీ సీన్స్‌కి ఫుల్ ఫైర్ తో సంగీతం ఉండబోతుందని టాక్. సర్వసిద్ధంగా తయారవుతోన్న ‘అఖండ 2’ ఇప్పటికే అభిమానుల్లో ఎనలేని ఆసక్తిని రేపుతోంది. "ఓం నమో వేంకటేశాయ", "ఓం నమో నరసింహాయ" అన్నట్టే.. ఈసారి “ఓం నమో అఖండాయ” అంటూ మాస్ ఫ్యాన్స్ దద్దరిల్లిపోతారనడంలో ఎలాంటి సందేహం లేదు!