టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరు అయినటువంటి సమంత గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె నాగ చైతన్య హీరో గా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన ఏం మాయ చేసావే అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాలోనే తన అందాలతో , నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించడంతో ఈ మూవీ తో ఈమెకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ వచ్చింది. దానితో ఈ మూవీ తర్వాత నుండి ఈమెకు టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు దక్కడం , అందులో చాలా సినిమాలు మంచి విజయాలను సాధించడంతో అత్యంత తక్కువ కాలం లోనే ఈమె తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది.

స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగాక ఈమె ఎప్పుడు మళ్లీ వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాకుండా పోయింది. ఇప్పటికి కూడా ఈమె అద్భుతమైన జోష్ లోనే కెరియర్ను ముందుకు సాగిస్తుంది. కానీ వరుస పెట్టి మునపటిలా సినిమాలు మాత్రం చేయడం లేదు. కొంత కాలం క్రితం ఈమె శుభం అనే సినిమాను నిర్మించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు. కొంత కాలం క్రితం ఈమె నందిని రెడ్డి దర్శకత్వంలో మా ఇంటి బంగారం అనే సినిమాను మొదలు పెట్టింది.

కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ సినిమా ఆగిపోయింది. ఇకపోతే ఇంత కాలానికి మళ్లీ ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్ ను ఈ సంవత్సరం సెప్టెంబర్ నుండి తిరిగి ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా స్టార్ట్ అయిన సినిమా ఆగిపోవడంతో సమంత అభిమానులు చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఇక మళ్లీ ఆ సినిమా రీ స్టార్ట్ కానుండడంతో సమంత అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: