మాస్ మహారాజా రవితేజ కొన్ని సంవత్సరాల క్రితం డాన్ శీను అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో శ్రియ , సలోని హీరోయిన్లుగా నటించారు. శ్రీహరి ,  శియజీ షిండే  ఈ మూవీ లో కీలక పాత్రలలో నటించారు. గోపీచంద్ మలినేని ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. గోపీచంద్ మలినేని ఈ సినిమాతోనే దర్శకుడిగా కెరియర్ను ప్రారంభించాడు. ఈ సినిమా 2011 సంవత్సరం ఆగస్టు 6 వ తేదీన విడుదల అయింది. ఈ మూవీ ఆ సమయంలో మంచి విజయం అందుకుంది. ఇక అప్పటికే వరుస అపజాలతో కెరీర్ను కొనసాగిస్తున్న  రవితేజ కు ఈ సినిమా మంచి ఊరటను కలిగించింది. మరి ఈ సినిమా ఆ సమయంలో ఎలాంటి కలెక్షన్లను వసూలు చేసి , ఏ రేంజ్ లాభాలను అందుకుంది , ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంది అనే వివరాలను తెలుసుకుందాం.

సినిమా టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి నైజాం ఏరియాలో 4.02 కోట్ల కలెక్షన్లను రాబట్టగా , సీడెడ్ ఏరియాలో 2.27 కోట్లు , ఉత్తరాంధ్రలో 1.68 కోట్లు , ఈస్ట్ లో 1.41 కోట్లు , వెస్ట్ లో 1.05 కోట్లు , గుంటూరు లో 1.24 కోట్లు , కృష్ణ లో 1.01 కోట్లు ,  నెల్లూరు లో 66 లక్షల కలెక్షన్లను దక్కించుకుంది. మొత్తంగా ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 13.34 కలెక్షన్లు దక్కాయి. రెస్ట్ ఆఫ్ ఇండియా , ఓవర్సీస్లలో కలుపుకొని ఈ మూవీ కి 1.72 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు 15.06 కోట్ల కనెక్షన్లు దక్కాయి. ఇకపోతే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 12.7 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి 15.06 కోట్ల షేర్ కలక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టింది. దానితో ఈ మూవీ ద్వారా బయ్యర్లకు రెండు కోట్లకు పైగా లాభాలు వచ్చాయి. దానితో ఈ సినిమా మంచి విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

rt