బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ రాధిక ఆప్టే తన సినిమాలతో కేవలం బాలీవుడ్ కే పరిమితం కాలేదు. సౌత్ ఇండస్ట్రీలో కూడా రాణించింది. అలా సౌత్ లో రాధిక ఆప్టే ప్రకాష్ రాజ్, బాలకృష్ణ, రజినీకాంత్ వంటి నటులతో స్క్రీన్ షేర్ చేసుకుంది.అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ సీన్ డిమాండ్ చేస్తే చాలు ఎలాంటి పాత్రలో అయినా నటించడానికి సిద్ధంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ నటి ఒంటిపై నూలు పోగు లేకుండా నటించిబోల్డ్ బ్యూటీగా పేరు సంపాదించింది. అయితే అలాంటి రాధిక ఆప్టే తాజాగా తన ప్రెగ్నెన్సీ సమయంలో ఎదుర్కొన్న ఒక చేదు అనుభవాన్ని బయట పెట్టింది. అయితే ప్రెగ్నెన్సీ అంటే చాలామంది ఇంటిదగ్గర కూర్చొని రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. కానీ హీరోయిన్స్ మాత్రం సినిమాలకు డేట్స్ ఇస్తే నిర్మాతలకు ఇబ్బంది కాకూడదు అనే ఉద్దేశంతో ప్రెగ్నెన్సీ అయినా కూడా షూటింగ్ సెట్లో పాల్గొంటూ ఉంటారు. అలా దీపిక పదుకొనే, రాధిక ఆప్టే,కియారా అద్వానీ,అలియా భట్ వంటి కొంతమంది హీరోయిన్లు ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా షూటింగ్ పూర్తి చేసేవారు.

అయితే రాధిక ఆప్టే కూడా తను ప్రెగ్నెన్సీలో ఉన్న టైంలో ఓ సినిమాలో చేసిందట.ఆ టైంలో బాలీవుడ్ నిర్మాత ఆమె పట్ల చాలా కర్కషంగ వ్యవహరించారట.. ఈ విషయం గురించి తాజాగా రాధిక ఆప్టే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను గర్భవతిగా ఉన్న టైంలో బాలీవుడ్ సినిమా చేస్తున్నా. అయితే నేను ప్రెగ్నెంట్ అనే విషయం తెలియడంతోనే ఆ సినిమా నిర్మాత నాపై కసురుకొని ఏదో పెద్ద తప్పు చేసాను అన్నట్లుగా నన్ను చూశారు.. అలాగే సినిమా కోసం టైట్ దుస్తులు ధరించాలని కండిషన్ పెట్టారు.కానీ అలా చేస్తే నాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పినా కూడా వినలేదు.కనీసం డాక్టర్ అపాయింట్మెంట్ ఉంటే చెకప్ చేయించుకోవడానికి వెళ్తున్నా అన్నా కూడా వినకుండా నువ్వు కచ్చితంగా సినిమా షూటింగ్ పూర్తి చేయాల్సిందే అని పట్టుబట్టారు. దాంతో డాక్టర్ ని కూడా కలవలేకపోయాను.
\
 ఇక కొన్ని కొన్ని సార్లు ప్రెగ్నెన్సీ లో వచ్చే నొప్పితో ఎంతో విలవిల లాడిపోయాను.అయినా కూడా ఆ నిర్మాత నాపై కనికరం చూపించి షూటింగ్ కి లో కొద్దిసేపు రెస్ట్ తీసుకో అని చెప్పలేదు.ఆ నిర్మాత నా పట్ల ప్రవర్తించిన తీరుకి నేను చాలా బాధపడిపోయాను.ఇది నా జీవితంలో ఎదురైనా ఒక పెద్ద చేదు అనుభవం అంటూ బోల్డ్ బ్యూటీ రాధిక ఆప్టే ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది. అయితే ఈ విషయం తెలిసిన చాలా మంది నెటిజన్లు ఆ బాలీవుడ్ నిర్మాత పై మండిపడుతున్నారు.కనీసం మానవత్వం లేదా..ప్రెగ్నెన్సీ లో ఉన్న మహిళతో ఎలా బిహేవ్ చేయాలో కూడా అర్థం కాదా..ఆ హీరోయిన్ నీ పేరేంటో బయట పెట్టలేదు కాబట్టి బతికి పోయావు. ఒకవేళ ఆ హీరోయిన్ ధైర్యం చేసి నీ పేరు బయటపెట్టి ఉంటే నిన్ను సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఆడుకునేవారు. కానీ ఆ హీరోయిన్ మాత్రం నీ పేరు బయట పెట్టలేదు.కాబట్టి బతికి బయటపడ్డావ్ అంటూ రాధికా ఆప్టే మాటలు విన్న చాలా మంది నెటిజెన్లు సోషల్ మీడియాలో కామెంట్ పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: