
అల్లు అర్జున్ లెవెల్ అంటే ఇది అంటూ బన్నీ ఫ్యాన్స్ ఆ రేంజ్ లో పొగిడెస్తున్నారు . తాజాగా బీహార్ లో కొందరు కుర్రాళ్ళు అల్లు అర్జున్ తరహా లోనే "తగ్గేదేలే" అంటూ రోడ్ల పైన తెగ హంగామా చేశారు . మ్యూజిక్ పెట్టుకుని అందరూ కూడా పుష్ప స్టైల్ లో రచ్చ చేస్తుంటే చుట్టుపక్కల వారు వారిని వచ్చి చూస్తూ ఉండిపోయారు. అసలు ఇక్కడ ఏదైనా సినిమా షూటింగ్ జరుగుతుందా ..? లేకపోతే నిజంగానే పుష్పరాజ్ వచ్చా0డా..? అనుకునేంత విధంగా హంగామా చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ వీడియో పై బన్నీ అభిమానులు అదేవిధంగా జనాలు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అల్లు అర్జున్ క్రేజ్ అంటే ఇలానే ఉంటది మరి అంటూ బన్నీ ఫ్యాన్స్ పొగిడేస్తూ ఇంకా హైలెట్ గా మారింది. పుష్ప2 కథలో పుష్పరాజ్.. భన్వర్ సింగ్ షెకావత్ మధ్య సీన్స్ ఉత్కం పెంచాయి . భారీ యాక్షన్స్ సీన్స్..చక్కటి డైలాగ్స్ .. దేవిశ్రీ మ్యూజిక్ ఈ సినిమాని వేరే లెవెల్ లో తీసుకెళ్ళింది . మరీ ముఖ్యంగా ఒక డైలాగ్ బాగా పాపులారిటీ చెందింది. "పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫ్లవర్ కాదు ఫైర్ ..వైల్డ్ ఫైర్ " అనే డైలాగ్ ఇప్పటికే ట్రెండింగ్ లోనే ఉంది. ఇప్పుడు ఈ కుర్రాళ్ళు చేసిన పని మరొకసారి పుష్ప3 హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అయ్యేలా చేస్తున్నాయి . సోషల్ మీడియాలో ఈ వీడియో బాగా ట్రెండ్ అవుతుంది..!!