
తాజాగా వార్ 2 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లోను అదే విధంగా మాట్లాడాడు నాగవంశీ . జూనియర్ ఎన్టీఆర్ - హృతిక్ రోషన్ ల కలయికలో తెరకెక్కిన తాజా సినిమా వార్ 2. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో ఘనంగా జరిగింది . త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు , నాగవంశీ,దిల్ రాజు ఈ ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్లుగా హాజరయ్యారు . ఈ క్రమంలోనే స్టేజి పైకి వచ్చిన నాగవంశీ తన మాటలతో అభిమానులను ఆకట్టుకున్నాడు . ఎప్పటిలానే తన దూకుడు తనాని ప్రదర్శించి వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఫుల్ రచ్చ రంబోలా చేసేశారు .
ఆయన మాట్లాడుతూ .." ఈ సినిమా థియేటర్స్ లో చూసిన తర్వాత మీరు కచ్చితంగా షాక్ అవుతారు . ఏ మాత్రం బాగోకపోయినా తిట్టండి.. తిట్టడం అలవాటే కదా.. తిట్టేసేయండి .. థియేటర్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత అద్భుతమైన సినిమా అని మీకు అనిపించకపోతే మళ్లీ ఎప్పుడు మైక్ పట్టుకుని సినిమా చూడమని నేను మిమ్మల్ని అడగను " అంటూ ఫ్యాన్స్ లో ఉత్సాహం నింపారు . "అంతేకాదు తొలిరోజు వార్ 2 కలెక్షన్ హిందీ వర్షన్ కంటే ఒక్క రూపాయి అయినా సరే తెలుగులో ఎక్కువ రావాలి ..దేవర కంటే పదిరెట్లు కలెక్షన్ రావాలి అన్న పవర్ ఇండియా అంత తెలియాలి ..ఇది టోటల్గా ఎన్టీఆర్ అభిమానుల బాధ్యత "అంటూ ఉత్సాహపరిచేలా మాట్లాడారు .
కానీ ఇది కొంతమంది రెచ్చగొట్టేతనం అంటూ ఆయనను ట్రోల్ చేస్తున్నారు . ఉత్సాహపరిచే మాట పక్కన పెడితే రెచ్చగొట్టేలా ఉన్నాయి నాగవంశీ మాటలు అన్న కామెంట్స్ ఇప్పుడు వినిపిస్తున్నాయి . నాగవంశీ మాట్లాడిన మాటలపై నెటిజన్లు భిన్న విభిన్న కామెంట్స్ చేస్తున్నారు . నాగవంశీ స్పీచ్ బూస్టప్ ఇవ్వడానికి ప్లాన్ చేసినట్లు లేదు అని అభిమానులను రెచ్చకొట్టడానికి చేసినట్లు ఉంది అని అంటున్నారు . మరికొందరు కలెక్షన్ల కోసం స్టేజి పైన అడుక్కుంటున్నారా..? అంటూ ట్రోల్ చేస్తున్నారు.
నాగ వంశీ చాలా సినిమాల ప్రీ రిలీజ్ లకి అటెండ్ అయ్యాడు కానీ ఈ విధంగా ఈ సినిమాను ప్రమోట్ చేయలేదు. మరి ముఖ్యంగా ఈ సినిమా కధా.. కంటెంట్ చూసి నాగవంశీ ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నారా ..? లేకపోతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎలాగోలా ఈ సినిమాని హిట్ చేసేస్తారు ముందుగానే మాట్లాడేస్తే సరిపోతుంది అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఈ విధంగా మాట్లాడారా..? సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్ లో నాగవంశీ మాటలపై చర్చలు మొదలయ్యాయి ఒకవేళ రేపటి రోజు సినిమా తెలుగులో అటూ ఇటూ టాక్ సంపాదించుకుంటే నాగ వంశీ ఏం చేస్తాడు..? మళ్లీ స్టేజి ఎక్కి మైక్ పట్టుకోగలడా..? అంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు . దీనికి క్లారిటీ అంటే ఆగస్టు 14న వార్ 2 సినిమా ఎటువంటి టాక్ దక్కించుకుంటుందో వేచి చూడాలి..??