
టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ - బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ కలయికలో, దర్శకుడు అయాన్ ముఖర్జీ రూపొందించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ “వార్ 2” ప్రస్తుతం దేశవ్యాప్తంగా హైప్ క్రియేట్ చేస్తోంది. యష్ రాజ్ ఫిల్మ్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా బాలీవుడ్ స్పై యూనివర్స్‌లో మరో అద్భుతమైన చాప్టర్‌గా రానుంది. ఇప్పటికే ట్రైలర్, టీజర్‌లు, ఫస్ట్ లుక్ పోస్టర్లు చూసి ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఎగ్జైట్ అయ్యారు. వార్ 2 సినిమా బుకింగ్స్ అలా ఓపెన్ అయ్యాయో లేదో ఎన్టీఆర్ ర్యాంపేజ్ మామూలుగా లేదు.
తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ ప్రభావం ఎంతగా ఉందో ఈ బుకింగ్ రికార్డులు స్పష్టంగా చూపించాయి. మాస్ సీట్లు, ప్రీమియం స్క్రీనింగ్ టికెట్లు , IMAX , 4DX ఫార్మాట్స్ అన్నీ వేగంగా హౌస్‌ఫుల్ అయ్యాయి. ముఖ్యంగా ఫ్యాన్స్ షోలు, ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ల కోసం థియేటర్ల ముందు భారీ క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. ఈ హడావుడి మొత్తం ఎన్టీఆర్ ఫ్యాక్టర్ వల్లే అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. “ వార్ 2 ” బుకింగ్స్ స్టార్ట్‌తోనే, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, ఎన్టీఆర్ ఫ్యాక్టర్ బాక్సాఫీస్ వద్ద ఎంత పవర్‌ఫుల్‌గా పనిచేస్తుందో మరోసారి రుజువైంది. ఇప్పుడు అందరి కళ్లూ ఫస్ట్ డే కలెక్షన్లపై ఉంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి ..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు