
ఈ వీడియోలో ఆయన తన అసలు పేరుతో పాటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొన్ని విషయాలను షేర్ చేసుకున్నారు. తన అసలు పేరు జగపతిరావు అని, కానీ ఇండస్ట్రీలో "రావులు" ఎక్కువైపోయారని, తన పేరు డిఫరెంట్‌గా ఉండాలని జగపతిబాబుగా మార్చుకున్నానని తెలిపారు. అంతేకాదు, "ఈ పేరు అందరి నోరులో ఈజీగా తిరుగుతుంది" అని సరదాగా నవ్వుకున్నారు. ఇక తర్వాత “అంతపురం” సినిమా షూటింగ్ గురించి గుర్తుచేసుకున్నారు. ఆ సినిమా క్లైమాక్స్‌లో తాను నటించేటప్పుడు "దాదాపు చనిపోయాననుకున్నా" అని చెప్పారు. డైరెక్టర్ కృష్ణవంశీ షూట్ చేసిన ఆ క్లైమాక్స్ సీన్లు చాలా కఠినంగా ఉండడంతో నిజంగానే అంతే అనుకున్నానని ఆయన గుర్తు చేసుకున్నారు. తన కెరీర్‌లో ఆ క్లైమాక్స్ సీన్‌నే తనకు ఫేవరెట్‌గా నిలిచిందని వెల్లడించారు.
అలాగే, చాలామంది జుట్టుకి రంగు వేయమని సజెస్ట్ చేస్తుంటారని, కానీ "ఈ రోజుల్లో జుట్టు ఉండటమే అదృష్టం" అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ఇలా తనలోని మరో యాంగిల్‌ని బయటపెట్టి, ప్రేక్షకులకు మరింత దగ్గర అవుతున్నారు జగపతిబాబు. అభిమానులు సోషల్ మీడియాలో జగపతిబాబు–నాగార్జునకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.