
రష్మిక డ్రాకులా బ్యాక్‌డ్రాప్ కాన్సెప్ట్‌లో కనిపిస్తోందనే అంచనాతో సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర చాలా కీలకమని తెలుస్తోంది. ఇప్పటివరకు రష్మికను ‘శ్రీవల్లిగా’, ‘గీతాంజలిగా’, ‘సమీరాగా’ ప్రేక్షకులు గుర్తుపెట్టుకున్నారు. కానీ ఈ సినిమాలో ఆమె పాత్ర మాత్రం లైఫ్‌టైమ్ గుర్తుండిపోయేలా ఉంటుందని మేకర్స్ అంటున్నారు. అంతేకాదు, నవాజుద్దీన్ సిద్ధిఖీ పాత్ర కూడా ఊహించని విధంగా వైలెంట్‌గా ఉంటుందని సమాచారం. రష్మిక పెర్ఫార్మెన్స్ ఈ సినిమాలో మరింత హైలైట్ అవుతుందని మేకర్స్ నమ్ముతున్నారు.
ఈ సినిమా హిట్ అయితే రష్మిక పేరు ప్రతి ఇండస్ట్రీలో మారుమ్రోగడమే కాదు, ఆమెను ఎప్పటికీ టాప్ హీరోయిన్ ప్లేస్‌లో ఊహించుకోవాల్సిందే అని అభిమానులు చెబుతున్నారు. బాలీవుడ్ రిపోర్ట్స్ నిజమైతే.. రష్మికకు ఇది నిజంగానే లైఫ్‌టైమ్ జాక్‌పాట్ ఛాన్స్. అలాంటి అవకాశాలు చాలా అరుదుగా మాత్రమే హీరోయిన్స్‌కి వస్తాయి. పైగా రష్మిక ఎలాంటి పాత్రనైనా తన స్టైల్లో లీనమైపోయి పోషించే నైపుణ్యం కలిగిన నటి. పర్ఫెక్ట్ టైంలో, పర్ఫెక్ట్ కాన్సెప్ట్‌ను ఎంచుకున్న రష్మిక ఈ సినిమాలో ఎంత రేంజ్‌లో మెరిసిపోతుందో చూడాలి..??