
ఇక అందులో మెగాస్టార్ తన పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేస్తూ కనిపిస్తారు. ఆ తర్వాత చరణ్ తన తండ్రిని హత్తుకుని ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవడం, చిరునవ్వులు పంచుకోవడం, ఒకరినొకరు ఎమోషనల్ గా చూసుకోవడం ఫ్యాన్స్ హృదయాలను హత్తుకుంది. ఆ వీడియో చూస్తుంటే చిరంజీవి – రామ్ చరణ్ బంధం ఎంత గాఢమో అర్థమవుతుంది. తండ్రి, కోడుకు మాత్రమే కాదు, ఒకరికి ఒకరు బెస్ట్ ఫ్రెండ్స్ లా ఉండే ఆ అనుబంధం స్క్రీన్ మీద ప్రతిబింబించింది. దీనికితోడు చరణ్ తన తండ్రిని ఎంతగా గౌరవిస్తాడో, అభిమానిస్తాడో ఆ వీడియోలో కనిపించింది. మెగా అభిమానులు ఈ వీడియో చూసి సోషల్ మీడియాలో షేర్లు, కామెంట్లతో హ్యాపీ బర్త్ డే విషెస్ చెబుతున్నారు.
ఇక “ఇది ఫాదర్ అండ్ సన్ గోల్స్” అని, “చూస్తుంటే కన్నీళ్లు ఆగడం లేదు”, “చిరంజీవి లాంటి తండ్రి, చరణ్ లాంటి కుమారుడు తెలుగు సినీ ఇండస్ట్రీకి వరం” అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇక మెగాస్టార్ 70వ వసంతం సందర్భంగా ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఆయన సినిమా ప్రయాణం, ప్రజాసేవ గురించి గుర్తుచేసుకుంటూ చిరంజీవి ఎప్పటికీ తెలుగు ప్రజల గర్వకారణమేనని పేర్కొన్నారు. మొత్తం మీద, అభిమానుల ఉత్సాహం, సినీ ఇండస్ట్రీ నుంచి శుభాకాంక్షలు, రామ్ చరణ్ షేర్ చేసిన ఆ ఎమోషనల్ వీడియో.. అన్నీ కలసి చిరంజీవి 70వ పుట్టినరోజును మరింత స్పెషల్ గా మార్చేశాయి.