ప్రస్తుతం తెలుగు ఫిలిం సర్కిల్‌లో ఎక్కువగా ట్రెండ్ అవుతున్న న్యూస్ ఏదైనా ఉంటే అది అల్లు అర్జున్అట్లీ కాంబినేషన్ సినిమా గురించే అని చెప్పాలి. ఇటీవలి కాలంలో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ ఫ్యాన్స్ వార్ సోషల్ మీడియాలో ఎంత హీట్ పెంచేసిందో అందరికీ తెలిసిందే. ఈ రెండు కుటుంబాలు సినిమా ఇండస్ట్రీలో చాలా పెద్ద స్థాయికి ఎదగడంతో, వారి మధ్య జరిగే చిన్న చిన్న విభేదాలు కూడా ఇండస్ట్రీ అంతటా చర్చనీయాంశమవుతున్నాయి. ఈ నేపధ్యంలో ఇప్పుడు అల్లు అర్జున్అట్లీ మూవీకి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో అల్లు అర్జున్ మూడు విభిన్న గెటప్పుల్లో కనిపించబోతున్నాడని చాలా కాలం నుంచే ప్రచారం జరుగుతోంది. దానికి తగ్గట్టుగానే ఐదు మంది హీరోయిన్‌లు ఈ సినిమాలో నటించబోతున్నారని సమాచారం బయటకు వచ్చింది. దీంతో బన్నీ ఐదుగురు హీరోయిన్‌లతో స్క్రీన్ షేర్ చేస్తూ ఇచ్చే పర్ఫార్మెన్స్ వేరే లెవెల్‌లో ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.


ఇక ఈ సినిమాకి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏమిటంటే .. అట్లీ గట్టిగా ఎమోషనల్ సీన్స్ రాసుకున్నాడట. అట్లీ స్టైల్లో మాస్, ఎమోషన్ మిక్స్ చేసిన సీన్స్ ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. అందువల్ల ఈ సినిమా కూడా ఆ రేంజ్‌లో ఉండబోతోందని అంచనా వేస్తున్నారు. అయితే ఇందులో కొన్ని డైలాగ్స్ పాతకాలం నాటి పంచ్ లైన్స్‌లా వినిపిస్తాయట. దర్శకుడు అట్లీ ఎవరినీ టార్గెట్ చేయాలనే ఉద్దేశంతో రాయకపోయినా, సినిమా రిలీజ్ అయ్యాక ఆ డైలాగ్స్ కొంతమంది మెగా ఫ్యామిలీకి వర్తించేలా అనుకుంటారని టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ఇంటర్వెల్ ఫైట్ సీన్‌లో అల్లు అర్జున్ చెబుతున్న కొన్ని ఘాటు డైలాగ్స్ ఆయనను తొక్కేయాలని చూసిన వారికి డైరెక్ట్ ఆన్సర్‌గా అనిపిస్తాయని ఫిలిం నగర టాక్. ఆ డైలాగ్స్ విన్నాక అల్లు అర్జున్ ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతారని  బజ్ నెలకొంది. దీంతో సినిమా రిలీజ్ అయిన తరువాత సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఫ్యాన్స్ వార్ మళ్లీ బాగా హీట్ పెంచే అవకాశం ఉందని కామెంట్స్ వస్తున్నాయి.


సినిమా షూటింగ్ పూర్తికావడానికి ఇంకా చాలా టైం ఉంది. మొన్ననే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లింది. ఇంకా షూటింగ్ పూర్తి కావాలంటే కనీసం సంవత్సరం, రెండు సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. ఆ తరువాతే ప్రమోషన్స్ మొదలవుతాయి. కానీ అప్పుడే సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి హీట్ చర్చలు మొదలైపోవడం కొంతమందికి విడ్డూరంగా అనిపిస్తోంది. సినీ ప్రముఖులు కూడా ఈ విషయంపై స్పందిస్తూ .. “ఇంకా సినిమా పూర్తికాకముందే ఇంత హంగామా జరుగుతోంది. సినిమా రిలీజ్ అయ్యే టైమ్‌కి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి అల్లు అర్జున్అట్లీ కాంబినేషన్ సినిమా ఏ  రేంజ్‌లో ఉంటుందనే ఆతృత ఫ్యాన్స్‌లో స్పష్టంగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: