
సోషల్ మీడియాలో జనాలు ఈ మధ్యకాలంలో “కాస్టింగ్ కౌచ్” అనే పదం కొంచెం తక్కువగా వినిపిస్తుంది అని చర్చిస్తున్నారు. గతంలో, ఎంతో మంది అమ్మాయిలు టాలెంట్ ఉన్నా కూడా ఇండస్ట్రీలో హీరోయిన్స్‌గా రాలేకపోయారు. ఇండస్ట్రీలోకి రావాలంటే, ఆసినిమాకు సంబంధించిన స్టార్‌లతో హద్దులు మీరాల్సిన పరిస్థితి ఉండేది. అప్పట్లో ఇది చాలా హీట్ క్రియేట్ చేసింది. చాలామంది, “ఇండస్ట్రీలో సెట్ అయిన వాళ్లూ కూడా ఇదే నిజం” అని ఒప్పుకున్నారు, “మాకు అలాంటి కమిట్మెంట్ ఇవ్వాల్సి రాలేదు” అని చెప్పి చేతులు దులిపేశారు.
ఈరోజుల్లో కొందరు హీరోయిన్స్ కూడా ఇలాగే చెబుతున్నారు. అయితే, పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. లేటెస్ట్గా ఇండస్ట్రీలోకి వచ్చే స్టార్ బ్యూటీస్ పరిస్థితి పూర్తిగా మార్చేశారు. ఒకప్పుడు సోషల్ మీడియా లేదు, ఇప్పుడు ఉంది. టాలెంట్ ఉంటే, ఏ డైరెక్టర్ దగ్గరకైనా మనం వెళ్లి అడుక్కోవాల్సిన అవసరం లేదు. మనం సోషల్ మీడియాలో ఒక అకౌంట్ క్రియేట్ చేసి, మన టాలెంట్‌ని జనాలకు ప్రూవ్ చేస్తే, ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ మనల్ని పిలిచి ఆఫర్స్ ఇస్తుంది. అలా వచ్చిన హీరోయిన్స్ కూడా ఇప్పుడు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ, ఎంకరేజ్ చేస్తున్నారు.
మరికొందరు మాత్రం యూట్యూబ్ ఫేమ్‌తో వచ్చినవాళ్లు కూడా ఇండస్ట్రీలో కొన్ని ఆఫర్లు అందుకోకపోవచ్చని చెబుతున్నారు. ఒక సినిమా హిట్ అయిన తర్వాత, చాలా మంది నెక్స్ట్ ఆఫర్స్ రాకుండా సైలెంట్‌గా ఉండే బ్యూటీస్ కూడా ఉన్నారు. మొత్తానికి, టాలెంట్ ఉన్నా లేకపోయినా కొన్నికొన్ని కమిట్మెంట్లు మాత్రం ఇండస్ట్రీలో ఇవ్వాల్సిందే అని వాళ్లు భావిస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చే అమ్మాయిల వర్షెన్ వేరేలా ఉంది. యూట్యూబ్ ద్వారా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించి, మన టాలెంట్ ఏంటో చూపిస్తే, ఏ డైరెక్టర్ మనల్ని టచ్ చేయకుండా ఉండలేరు అని అంటున్నారు. భవిష్యత్తులో దీనిపై మరింత మంది హీరోయిన్స్ స్పందిస్తే బాగుంటుంది అని కామెన్ పీపుల్స్ మాట్లాడుతున్నారు..!