ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందిని బాధిస్తున్న వ్యాధులలో క్యాన్సర్ ఒకటి. క్యాన్సర్ వచ్చింది అంటే చాలు జనాలు భయపడే పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి. క్యాన్సర్ వచ్చింది అం టే వారి లో చాలా మంది ప్రస్తుతం చనిపోతున్నారు. దానితో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్నో దేశాలు క్యాన్సర్ కు మెరుగైన మందును కనుగొనడం కోసం ఎన్నో ప్రయత్నాలను చేస్తూ వస్తున్నాయి. ఇక అమెరికా లాంటి సంపన్న దేశం కూడా ఇప్పటివరకు క్యాన్సర్ పై ఎన్నో మందులను కనుక్కోవడానికి పరిశోధనలు చేసిన వారు కూడా పెద్ద స్థాయిలో క్యాన్సర్ మందు కనుక్కోవడంలో సక్సెస్ కాలేదు.

ప్రస్తుతం రష్యా క్యాన్సర్ మందు విషయంలో చాలా ముందుకు దూసుకుపోయినట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... ఇప్పటికే రష్యా ఫ్రీ క్యాన్సర్ వ్యాక్సిన్ అనే దానిని అమలు చేయబోతుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ట్రైల్స్ కూడా కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. ఇక రష్యా కనుగొన్న ఫ్రీ క్యాన్సర్ వ్యాక్షన్ పూర్తి స్థాయిలో సక్సెస్ అయినట్లయితే రెండు సంవత్సరాలలో రష్యా దాదాపు 1 ట్రిలియన్ డాలర్ల ఆదాయాన్ని సంపాదించుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం రష్యా లో పరిస్థితులు ఏ మాత్రం బాగోలేవు అనే విషయం మన అందరికీ తెలిసిందే.

దానితో ప్రస్తుతం రష్యా కు అత్యంత స్నేహ పూరిత దేశం అయినటువంటి ఇండియా లోనే రష్యా కనుగొన్న క్యాన్సర్ వ్యాక్సిన్ ప్రొడక్షన్ జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అదే గాని జరిగితే రష్యా తో పాటు ఇండియా కూడా పెద్ద ఎత్తున లాభపడే అవకాశాలు ఉన్నాయి అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. మరి రష్యా తమ క్యాన్సర్ మందును ప్రొడక్షన్ చేసే విషయంలో ఎలాంటి ముందడుగు వేస్తుంది అనేది తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: