
ఈ విషయంపై చాలా మంది విమర్శకులు మండిపడుతుండగా, పవన్ సింగ్ టీమ్ మాత్రం మౌనం పాటిస్తోంది. తాజాగా ఆయన రెండో భార్య జ్యోతి సింగ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఒక పోస్ట్ చేసింది. ఆ పోస్ట్‌తో వీరిద్దరి మధ్య ఏదో విభేదాలు ఉన్నాయని జనాలు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఆమె ఆ పోస్ట్‌లో రాసిన మాటలు ఇలా ఉన్నాయి. "నేను నిన్ను కలవడానికి ఎంతో ప్రయత్నిస్తున్నాను, కానీ నువ్వు కలవడానికి ఇష్టపడటం లేదు. నీ దగ్గర నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు. పదేళ్లుగా నేను మానసిక ఒత్తిడికి లోనవుతున్నాను. లక్నోలో జరిగిన ఒక కార్యక్రమంలో నిన్ను కలవడానికి ఎంత ప్రయత్నించానో నీకు తెలుసు, కానీ నువ్వు నన్ను కలవలేదు. చాలా నెలలుగా నీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాను. కనీసం ఇది చూసైనా స్పందిస్తావని అనుకుంటున్నాను. ఏళ్లుగా నేను ఈ బాధను భరిస్తున్నాను. తీవ్ర ఒత్తిడిలో ఉన్నాను. ఆత్మహత్య తప్ప వేరే మార్గం కనిపించడం లేదు. సజీవదహనం చేసుకోవాలని అనిపిస్తోంది. కానీ అది నా తల్లిదండ్రులకు కలంకం అవుతుందని ఆగిపోతున్నాను. కనీసం నన్ను భార్యగా కాకపోయినా, సాటి మనిషిగా చూడటం లేదు. నువ్వు నీ రాజకీయ ప్రత్యర్ధులను కూడా ఆలింగనం చేసుకుంటావు, కానీ నీ భార్యని ఎందుకు ఇంత కఠినంగా చూస్తున్నావు? నేను చేసిన తప్పేంటి?"..అంటూ స్ట్రాఇట్ గా ప్రశ్నించింది.
ఈ పోస్ట్‌తో పవన్ సింగ్ మరియు ఆయన భార్య మధ్య విభేదాలు ఉన్నట్లు స్పష్టమైంది. పవన్ సింగ్‌కు ఇది రెండో పెళ్లి. 2018లో ఆయన జ్యోతిని వివాహం చేసుకున్నారు. ఆయన మొదటి భార్య మరణించిన తర్వాత జ్యోతితో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు రెండో భార్యనూ దూరంగా పెట్టారనే వార్తలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. ఇటీవల వీరి ఫోన్ కాల్ రికార్డింగ్ సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. దీంతో పవన్ సింగ్ వ్యక్తిగత విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. భోజ్‌పురి ఇండస్ట్రీలోనే కాకుండా మిగతా సినీ ఇండస్ట్రీలలో కూడా పవన్ సింగ్ పేరు రచ్చ చేస్తోంది.
