
తాజాగా బన్నీ నానమ్మ గారు స్వర్గస్తులయ్యారు. ఈ బాధాకర సమయంలో బన్నీ కుటుంబానికి, అల్లు అరవింద్ గారికి సపోర్ట్‌గా సినీ ఇండస్ట్రీ మొత్తం కదిలి వచ్చింది. పలువురు స్టార్స్, సినీ ప్రముఖులు అల్లు కాంపౌండ్‌కి వచ్చి పరామర్శించారు. కార్యక్రమాలు అన్ని సాంప్రదాయబద్ధంగా జరిగేలా అల్లు అరవింద్ గారు, బన్నీ దగ్గరుండి అన్ని పూర్తి చేశారు. ఈ ఫొటోలు, వీడియోలు బయటకు వచ్చిన తర్వాత ఒక్క ప్రశ్న అందరి మనసులో తలెత్తింది.. అల్లు అరవింద్ గారి అమ్మగారు చనిపోతే ఇండస్ట్రీ మొత్తం కదిలి వచ్చింది కానీ ఒక స్టార్ హీరో మాత్రం కనిపించలేదు. ఎందుకు రాలేదని నెట్టింట చర్చ మొదలైంది. ఎప్పుడూ బన్నీతో సరదాగా ఉంటూ, పలు వైరల్ పోస్టులు షేర్ చేసుకునే ఆ స్టార్ హీరో ఎందుకు రాలేదు అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
సోషల్ మీడియాలో ఈ విషయాన్ని పెద్దగా చూపిస్తూ రచ్చ చేస్తున్నారు. అయితే ఆ హీరో సినిమా షూటింగ్ షెడ్యూల్ కారణంగా వేరే రాష్ట్రంలో ఉన్నారని, షెడ్యూల్ క్యాన్సిల్ చేసి రాలేని పరిస్థితి కారణంగానే ఆయన రాలేకపోయారని తెలుస్తోంది. దీనికి మరే వ్యక్తిగత ఇబ్బందులు లేవని, ఈ ఇష్యూ ఇక్కడితో ముగించాలని ఫ్యాన్స్ చెబుతున్నారు. కానీ కొంతమంది కావాలనే దీన్ని రచ్చ చేస్తున్నారు. రామ్ చరణ్ కూడా "పెద్ది" సినిమా షూటింగ్‌తో బిజీగా వేరే రాష్ట్రంలో ఉన్నా, బన్నీని పరామర్శించడానికి వచ్చారు. బన్నీ కూడా ముంబైలో ఉన్నప్పటికీ విషయం తెలుసుకున్న వెంటనే హైదరాబాద్‌కు వచ్చి నానమ్మ పార్థివదేహాన్ని చూసి బోరున విలపించారు. పలువురు స్టార్ సెలబ్రిటీలు కూడా వచ్చి బన్నీని పరామర్శించారు.
మరి బన్నీకి అంత ప్రాధాన్యత ఉన్న ఆ హీరో ఒక్కరోజు షూటింగ్ క్యాన్సిల్ చేసి రాలేరా? ఫ్లైట్ టికెట్ బుక్ చేసి వచ్చి ఉండలేరా? అనేది నెట్టింట పెద్ద ప్రశ్నగా మారింది. కొంతమంది బన్నీ, అల్లు అరవింద్ లతో ఆ హీరో కి మిస్ అండర్‌స్టాండింగ్ వల్లే ఆ హీరో రాలేదంటూ వదంతులు పుట్టిస్తున్నారు. అయితే ఇండస్ట్రీ ఇన్సైడర్స్ ప్రకారం అలాంటిదేమీ లేదు. ఆ హీరో బన్నీకి కాల్ చేసి విషయాలు పూర్తిగా మాట్లాడారని, అల్లు అరవింద్ గారిని కూడా ఫోన్‌లో పరామర్శించారని తెలుస్తోంది. సోషల్ మీడియాలో కొందరు కావాలనే దీన్ని రచ్చ చేస్తున్నారని ఫ్యాన్స్ కొట్టిపారేస్తున్నారు.