నందమూరి అలేఖ్య రెడ్డి పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అందరికీ సుపరిచితురాలు. నందమూరి తారకరత్న గారి భార్య అయిన అలేఖ్య రెడ్డి సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ, తన కుటుంబానికి సంబంధించిన విషయాలపై అభిమానులతో చిట్‌చాట్ చేస్తూనే ఉండేవారు. అయితే, నందమూరి తారకరత్న మరణం తర్వాత ఆమె సోషల్ మీడియాకు దూరమయ్యారు. అవసరమైతే తప్ప, సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా ఉండటం లేదు. కేవలం 39 ఏళ్ల వయసులో గుండెపోటుతో 2023 ఫిబ్రవరి 18న తారకరత్న కన్నుమూశారు. ఆయన మరణం పట్ల నందమూరి కుటుంబం, సినీ అభిమానులు, టిడిపి శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.


తారకరత్న హీరోగా గుర్తింపు పొందడమే కాకుండా రాజకీయాలలో కూడా చురుగ్గా పాల్గొంటూ, నందమూరి ఫ్యామిలీ ప్రతిష్టను మరింతగా పెంచేందుకు తన శక్తిమేర కృషి చేశారు. తాజాగా ఆయన భార్య అలేఖ్య రెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. రీసెంట్‌గా అలేఖ్య రెడ్డి సోషల్ మీడియాలో అభిమానులతో చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంలో ఓ నెటిజన్ అలేఖ్యను సూటిగా ప్రశ్నించాడు. "మిమ్మల్ని వాళ్లు ఎప్పుడూ కలుసుకోరు కదా, మరి ఎందుకు ప్రతిసారి ‘మా ఫ్యామిలీ, మా ఫ్యామిలీ’ అని అంటుంటారు?” అని ప్రశ్నించారు.



దానికి అలేఖ్య రెడ్డి కూడా అంతే సూటిగా జవాబుఇచ్చింది. “ఎవరు మమ్మల్ని చూసినా చూడకపోయినా, మాట్లాడినా మాట్లాడకపోయినా, అంగీకరించినా అంగీకరించకపోయినా, కలిసినా కలవకపోయినా ఏం మారదు. ఇది నా కుటుంబం, ఎప్పటికీ నా కుటుంబమే” అని స్పష్టంగా తెలిపారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె షేర్ చేసిన వీడియోపై అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఆమెలో ఉన్న కాన్ఫిడెన్స్‌ను ప్రశంసిస్తున్నారు. “ఫ్యామిలీ అంటే చిన్న చిన్న గొడవలు సహజం, కానీ ఎప్పటికైనా కలిసిపోవడం ముఖ్యం” అని కొందరు కామెంట్ చేస్తుంటే, మరికొందరు "ఇదే నందమూరి ఫ్యామిలీ సాంప్రదాయం అని" మండిపడుతున్నారు..ఇంకొందరు “మీ మంచితనమే మిమ్మల్ని వాళ్లకు దగ్గర చేస్తుంది, గాడ్ బ్లెస్ యూ” అంటూ ఆశీర్వదిస్తున్నారు.



అయితే, కొందరు మాత్రం అలేఖ్య రెడ్డిని నందమూరి కుటుంబం ఎందుకు పూర్తిగా అంగీకరించలేదనే విషయాన్ని హైలైట్ చేస్తూ నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. అలేఖ్య రెడ్డి నందమూరి ఫ్యామిలీ గురించి ఎంత గొప్పగా మాట్లాడినా, కొందరు కావాలనే ఆమెను టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు. ఎప్పటికైనా అలేఖ్య రెడ్డిని నందమూరి కుటుంబం అంగీకరిస్తుంది, ఆమె ముగ్గురు పిల్లల బాధ్యతలను కూడా నందమూరి కుటుంబం చూసుకుంటుందనే ఆశాభావం అభిమానుల్లో ఉంది. దీనికి సమాధానం కాలమే చెప్పాలి..!!



మరింత సమాచారం తెలుసుకోండి: