
నేటి యువత వెబ్ రివ్యూలు, సోషల్ మీడియా రిపోర్టులనే బాగా నమ్ముతుంది. దీంతో మొదటి రోజు రెండో షోకే థియేటర్లలో ఖాళీ సీట్లు కనిపించే పరిస్థితి వస్తోంది. ఇటీవల విడుదలైన కొన్ని సినిమాలకూ ఇదే పరిస్థితి ఎదురైంది. అన్ని సినిమాలు రిలీజ్‌కు ముందే ప్రీమియర్ షోలు పెట్టడంతో, తెల్లారేసరికి టాక్ బయటకు వచ్చింది. ఫలితంగా కలెక్షన్లపై ప్రతికూల ప్రభావం పడింది. నిర్మాతలు ఇప్పుడు ఈ ట్రెండ్‌పై మళ్లీ ఆలోచన చేస్తున్నారు. "ప్రీమియర్లు పెడితే లాభం కంటే నష్టమే ఎక్కువ" అనే అవగాహన పెరుగుతోంది. కొన్ని సినిమాల నిర్మాతలు అతి నమ్మకంతో ప్రీమియర్లు వేస్తే, ఫలితం రివర్స్ అవడంతో తాము ఎదుర్కొన్న డామేజీ ఊహించని స్థాయిలో ఉందని అంగీకరిస్తున్నారు. సినిమా నిజంగా బాగుంటే మాత్రం ప్రీమియర్ షోలు పెద్ద ప్లస్ అవుతాయి. ప్రేక్షకుల్లో పాజిటివ్ టాక్ ఏర్పడి, మొదటి రోజే భారీ కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంటుంది.
అందుకే నిర్మాతలు ఇప్పుడు మరింత జాగ్రత్తగా ఆలోచిస్తున్నారు. ఉదాహరణకు, ఈ వారం రానున్న “ఘాటీ”, “మదరాసీ” సినిమాలకు ప్రీమియర్లు పెట్టకపోవడం వెనుక ఇదే లాజిక్ ఉంది. ఇకపై ఎక్కువమంది నిర్మాతలు సినిమా రిజల్టఫై పక్కా కాన్ఫిడెంట్ లేకపోతే ప్రీమియర్లు వద్దు అన్న నిర్ణయానికి వచ్చేసినట్టే కనిపిస్తోంది. ఏదేమైనా తెలుగు సినిమా చరిత్రలో ఈ ప్రీమియర్ల గోల కాస్త తగ్గుముఖం పట్టే అవకాశాలే ఎక్కువుగా కనిపిస్తున్నాయి.