తెలుగు బుల్లితెర యాంకర్లలో ఓ వెలుగు వెలిగిన వారిలో ఉదయభాను ఒకరు. లేడీ యాంకర్స్ తెలుగులో తక్కువ మంది ఉన్న సమయంలో ఉదయభాను తెలుగు బల్లి తెరపై అనేక టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరించి టాప్ యాంకర్ గా ఎన్నో సంవత్సరాల పాటు కెరియర్ను కొనసాగించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఉదయభాను "త్రిబాణధారి బార్బరిక్" అనే సినిమాలో నటించింది. ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే విడుదల అయింది. తాజాగా ఉదయభాను ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో భాగంగా నందమూరి బాలకృష్ణ వ్యక్తిత్వం గురించి పలు ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది.

తాజా ఇంటర్వ్యూలో భాగంగా ఉదయభాను , బాలకృష్ణ గురించి మాట్లాడుతూ ... బాలకృష్ణ గారి గురించి నేను పలు సందర్భంలో ఎంతో పాజిటివ్ మాట్లాడాను. నేను చాలా మంది హీరోల గురించి పాజిటివ్ గా మాట్లాడాను. కానీ బాలకృష్ణ గారి గురించి పాజిటివ్ గా మాట్లాడడం వెనక ఒక ప్రధానమైన కారణం ఉంది. అది ఏమిటి అంటే ..? ఆయనను నేను చాలా దగ్గర నుండి చూశాను. ఆయన వ్యక్తిత్వం ఎంతో గొప్పది. సినిమా ఫంక్షన్లకు ఆయన వచ్చిన అక్కడ వెయిటింగ్ ఉన్న ఏ మాత్రం దానిని సీరియస్గా తీసుకోడు.

ఎంత సేపు అయినా వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక నా ఫ్యామిలీతో కూడా ఆయన ఎంతో బాగుంటాడు. నా కుటుంబానికి ఎంతో గౌరవం ఇస్తూ ఉంటారు. కొంత కాలం క్రితమే నా కూతుర్లను బాలకృష్ణ గారికి పరిచయం చేశాను. దానితో బాలకృష్ణ గారు ఎంత పెద్ద వాళ్ళు అయిపోయారు. నా కోడల్లారా ఇటు రండి. మనందరం కలిసి ఒక ఫోటో దిగుదాం అని ఆయన నా పిల్లల్ని పిలిచి మోకాళ్ళపై కూర్చొని మరి వారితో ఫోటోలు దిగాడు. అంత గొప్ప వ్యక్తి బాలకృష్ణ గారు అని ఉదయభాను చెప్పుకొచ్చింది. ఇక ఉదయభాను తాజాగా బాలకృష్ణ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: