
క్రిష్ ‘ఆదిత్య 999’ కోసం కొత్త కథ రెడీ చేస్తున్నారట. అయితే అప్పట్లో సింగీతం ఇచ్చిన స్క్రిప్ట్ ఏం అయిందన్న ప్రశ్న అందరికి కలుగుతోంది. ఫిల్మ్ నగర్ టాక్ ప్రకారం – సింగీతం రెడీ చేసిన ఆ స్క్రిప్ట్‌లోని కొన్ని ఎలిమెంట్స్ ఇప్పటికే వాడేశారట. ముఖ్యంగా ‘కల్కి’ సినిమాకి సింగీతం స్క్రిప్ట్ కోఆర్డినేటర్‌గా పని చేశారు. అప్పుడు ఆయన దగ్గరున్న ‘ఆదిత్య 999’లోని కొన్ని ఐడియాలను ‘కల్కి’లో వాడేశారట. అంతేకాదు, ‘కల్కి 2’లో కూడా వాటిని ఉపయోగించబోతున్నారని అంటున్నారు. అంటే, సింగీతం స్క్రిప్ట్ ఎక్కువ భాగం ‘కల్కి’ ఫ్రాంచైజ్లో మిక్స్ అయిపోయిందని టాక్. అందుకే ఆ స్క్రిప్ట్‌ని ఇప్పుడు బాలయ్య ప్రాజెక్ట్‌కి వాడలేకపోతున్నారని చెబుతున్నారు. దీంతో క్రిష్ కొత్తగా ఓ ఫ్రెష్ కథ రాయడానికి నిర్ణయించుకున్నారట. ఈసారి క్రిష్, బాలయ్య కోసం స్పెషల్‌గా ఏదో మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్ రెడీ చేస్తున్నారట.
అంతేకాదు, ఈ సినిమాలో బాలయ్య కోడుకు మోక్షజ్ఞ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని గుసగుసలు మరింత బలంగా వినిపిస్తున్నాయి. ‘ఘాటీ’ తర్వాత క్రిష్ – బాలయ్య కాంబినేషన్‌లో వచ్చే సినిమా ఇదే అని టాలీవుడ్‌లో బలమైన ప్రచారం జరుగుతోంది. క్రిష్ ఈ విషయంపై నోరు విప్పకపోయినా, అన్ని నిర్ణయాలు బాలయ్య చెప్పేదాకా వేచి చూస్తున్నారట. బాలయ్య ఏ రోజు ఈ ప్రాజెక్ట్‌పై ఓ అధికారిక ప్రకటన చేస్తాడో, అప్పటి వరకూ టాలీవుడ్ అంతా ఎదురుచూస్తూనే ఉంటుంది. ‘ఆదిత్య 999’ – ఒకప్పుడు కలగా మిగిలిపోయిన ఈ సినిమా, ఇప్పుడు మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. నిజంగానే ఇది రానుందా? మోక్షజ్ఞ ఎంట్రీతో బాలయ్య – క్రిష్ ఈ ప్రాజెక్ట్‌ని లాంచ్ చేస్తారా? అన్నది సినీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.