టాలీవుడ్‌లో ‘హిట్’, ‘సూపర్ హిట్’ అనే మాటలు వినిపించక చాలా రోజులు అవుతోంది. 2025లో ఇప్పటివరకు విజయాల శాతం చాలా తక్కువగా ఉండడం ఫ్యాన్స్‌కే కాదు, బాక్సాఫీస్‌కే కూడా పెద్ద షాక్. ఆగస్టులో అయితే గట్టి దెబ్బలు తగిలాయి. ఇప్పుడు కనీసం ఈ నాలుగు నెలలైనా బాక్సాఫీస్ దుమ్మురేపాలని ఫిల్మ్ నగర్‌ ఆశిస్తోంది. అందులోనూ సెప్టెంబర్ మాసం టాలీవుడ్‌కు చాలా కీలకం. ఎందుకంటే ఈ నెలలోనే పలువురు స్టార్ హీరోలు, క్రేజీ ప్రాజెక్టులు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.


మొదటగా సెప్టెంబర్ 5న ‘ఘాటీ’ రిలీజ్ అవుతోంది. క్రిష్ దర్శకత్వంలో, అనుష్క ప్రధాన పాత్రలో వస్తున్న ఈ లేడీ ఓరియెంటెడ్ సినిమా మీద అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. స్వీటీ అనుష్క వెండి తెరపై కనిపించి చాలా కాలం అవుతోంది. ఈసారి క్రిష్ డైరెక్షన్‌లో అనుష్క పవర్‌ఫుల్ పాత్రలో మెరిపించబోతోంది. “ఇది ఘాటీ కాదు.. ఘాటు సినిమా” అని ప్ర‌మోష‌న్స్‌లో చెప్పుకుంటూ హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఈ రేంజ్‌లో హైలైట్ అయితే, టాలీవుడ్‌కు మొదటి హిట్ గ్యారెంటీ అన్న టాక్ ఉంది.



సెప్టెంబర్ 12 వారం డబుల్ ట్రీట్. ఒకవైపు ‘కిష్కిందపురి’, మరోవైపు ‘మిరాయ్’. కిష్కిందపురి ట్రైలర్‌తోనే హారర్ లవర్స్‌కి గట్టి కిక్ ఇచ్చింది. విజువల్స్ అద్భుతంగా ఉండటంతో ఇది వేరే లెవల్‌లో ఉంటుందని టాక్. అదే వారం తేజా సజ్జా నటించిన ‘మిరాయ్’ కూడా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. హ‌నుమాన్‌తో పాన్ ఇండియా స్థాయిలో మార్కెట్ క్రియేట్ చేసుకున్న తేజా, ఈసారి ఫాంటసీ అడ్వెంచర్ స్టోరీతో వచ్చేశాడు. ట్రైలర్ చాలా ప్రామిసింగ్‌గా ఉంది. ఇప్పటికే నార్త్ మార్కెట్లో కూడా చర్చ మొదలైంది. అంటే ఈ రెండు సినిమాలు కలిపి సెప్టెంబర్ రెండో వారం టాలీవుడ్‌కు బిగ్ బూస్ట్ ఇవ్వొచ్చు.



అయితే, ఈ నెల మొత్తానికి గ్లోబల్‌గా ఫోకస్ అయిన సినిమా ఒక్కటే – ‘ఓజీ’. సెప్టెంబర్ 25న పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ రిలీజ్ అవుతోంది. గత రెండేళ్లుగా పవన్ ఎక్కడికి వెళ్లినా అభిమానులు “ఓజీ… ఓజీ” అంటూ నినాదాలు చేశారు. గ్లింప్స్, పాటలు, అప్‌డేట్స్ ఒక్కోటి ఒక్కో రేంజ్ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. టీజర్ వస్తే ఫ్యాన్ ఫ్రెంజీ మళ్లీ రెట్టింపు అవుతుంది. పవన్ కెరీర్‌లోనే కాకుండా, 2025లో టాలీవుడ్ మొత్తానికి కూడా అతి పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ అవ్వగల శక్తి ఉన్న సినిమా ఇదే.మొత్తానికి సెప్టెంబర్ మాసం టాలీవుడ్‌కు టర్నింగ్ పాయింట్ కావొచ్చు. ఘాటీ, కిష్కిందపురి, మిరాయ్ మంచి టాక్ తెచ్చుకున్నా… ‘ఓజీ’ మాత్రం గేమ్ ఛేంజర్‌గా నిలవడం ఖాయం. హిట్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న ఇండస్ట్రీకి ఈ నెల ‘గోల్డెన్ మంత్’ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు!

మరింత సమాచారం తెలుసుకోండి: