సినిమా ఇండస్ట్రీ లో కెరియర్ విషయంలో హిట్ లు ఎంత ప్రభావాన్ని చూపుతాయో ... ప్లాప్స్ కూడా అంతే తీవ్రమైన స్థాయిలో ప్రభావాన్ని చూపుతాయి. హిట్స్ వచ్చిన సమయంలో నటీ నటులకు అదిరిపోయే రేంజ్ లో అవకాశాలు వస్తూ ఉంటాయి. అదే ఫ్లాప్స్ వచ్చినా కూడా అవకాశాలు తగ్గుతూ ఉంటాయి. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే నాలుగు సినిమాలతో మంచి విజయాలను అందుకున్న ఓ ముద్దుగుమ్మ తన కెరియర్లో తెలుగులో నటించిన ఒకే ఒక సినిమాతో ఆపజయాన్ని అందుకుంది. ఆ అపజయం తర్వాత ఆమెకు అవకాశాలు చాలా వరకు తగ్గాయి. మళ్లీ ఆమె ప్రస్తుతం కొన్ని సినిమాల్లో నటిస్తుంది.

ఆ మూవీలతో ఆమె మంచి విజయాలను అందుకుంటే ఆమె కెరియర్ ఫుల్ స్పీడులోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. ఇంతకు తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత నటించిన మూడు సినిమాలతో మంచి విజయాలను అందుకొని ఆ తర్వాత ఒకే ఒక ఆపజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకున్న ఆ నటి ఎవరు అనుకుంటున్నారా ..? ఆమె మరెవరో కాదు మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని సంయుక్తా మీనన్. ఈ ముద్దుగుమ్మ పవన్ కళ్యాణ్ , దగ్గుపాటి రానా హీరోలుగా రూపొందిన భీమ్లా నాయక్ అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ లో ఈమె రానా కు భార్య పాత్రలో నటించింది. 

మూవీ మంచి విజయాన్ని సాధించింది. ఈ మూవీ తర్వాత ఈమె నటించిన బింబిసారా , సార్ , విరూపాక్ష సినిమాలు కూడా అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. దానితో ఈమె క్రేజ్ ఒక్క సారిగా తెలుగు సినీ పరిశ్రమలో పెరిగిపోయింది. ఆఖరుగా ఈమె కళ్యాణ్ రామ్ హీరో గా రూపొందిన డెవిల్ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ప్రస్తుతం ఈమె స్వయంభు , అఖండ 2 సినిమాల్లో నటిస్తుంది. వీటితో పాటు విజయ్ సేతుపతి , పూరి జగన్నాథ్ కాంబోలో రూపొందుతున్న సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. ఈ మూవీ లు అన్ని మంచి విజయాలు సాధిస్తుండడంతో ఈమె క్రేజ్ మళ్లీ పెరిగే అవకాశం ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

sm