ప్రస్తుతం దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంల కంటే చంద్రబాబు చాలా సీనియర్ అని చెప్పవచ్చు. ఒకరకంగా చెప్పాలంటే ఆయన ఒక ప్రధాని క్యాండిడేట్ అని కూడా అనుకోవచ్చు. అలాంటి చంద్రబాబు నాలుగవసారి ఆంధ్రప్రదేశ్ కి సీఎం అయిన తర్వాత అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా అద్భుతమైన అభివృద్ధి సాధిస్తుంది. అయితే ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ దేశ వృద్ధి రేటు కంటే ఎక్కువ అభివృద్ధి సాధించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రణాళిక శాఖ అధికారులు తెలియజేశారు. మరి ఆంధ్రప్రదేశ్ ఎంత వృద్ధిరేటు సాధించింది అనే వివరాలు చూద్దాం.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం 2025-26 త్రైమాసికానికి గాను 10.50% వృద్ధి ని సాధించింది. అయితే ఈ అభివృద్ధి అనేది  జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉండడం ఒక రికార్డు అని చెప్పవచ్చు.

 జాతీయ సగటు వృద్ధిరేటు 8.8 శాతంగా ఉంది. జాతీయ విధి రేటు కంటే ఆంధ్రప్రదేశ్ విధి రేటు ఎక్కువగా పెరిగిందని చెప్పవచ్చు. గత ఏడాది ఇదే కాలంలో  9.58% వృద్ధిరేటుతో పోలిస్తే గణనీయమైనటువంటి పురోగతి సాధించింది. ముఖ్యంగా పారిశ్రామిక రంగం 11.91% వృద్ధి రేటు తో అగ్రస్థానంలో ఉండగా సేవారంగం  10.70% వృద్ధి నమోదు చేసింది. పర్యాటకం, హోటల్ లు ఇతర రంగాల్లో  17.92% వృద్ధి రేటుని సాధించాయి. అంతేకాకుండా వ్యవసాయ సంబంధిత రంగాల్లో 9.60 శాతం అభివృధి సాధించాయని అధికారులు అన్నారు. ముఖ్యంగా అగ్రస్థానంలో అక్వా కల్చర్ చేపల పెంపకం నిలిచింది. ఇంతటి వృద్ధి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాధించడానికి ప్రధాన కారణం  పారిశ్రామిక కేంద్రాలు, ఐటీరంగం, ఇతర చట్ట వ్యవస్థలో సంస్కరణలపై దృష్టి పెట్టడమే.

అంతేకాకుండా  రాష్ట్రంలో కొత్త విధి విధానాలు వ్యాపార స్థాపనకు సులభతరం చేస్తూ లక్షల కుటుంబాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. 2025-26 మొదటి త్రైమాసికంలో  ఏపీ 8860 కోట్ల నికర జీఎస్టీ వసూళ్లను నమోదు చేసి రికార్డు సాధించింది. ఓవైపు రాజధాని అయినటువంటి అమరావతి తోపాటు ఇతర మౌలిక సదుపాయ పనులను విస్తృతంగా చేపడుతుంది. రాష్ట్రంలో ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షిస్తూ ఆర్థిక సామాజిక రంగాల్లో ప్రజలు ముందుకు వెళ్లేలా అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ పాలన సాగిస్తున్నారు. ముఖ్యంగా రవాణా,హోటల్, బ్యాంకింగ్, రైల్వేలు,రియల్ ఎస్టేట్ వంటి రంగాలపై దృష్టి పెట్టాలని చెప్పారు. ఇలా అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించారు కాబట్టే వృద్ధిరేటు అనేది ఘననీయంగా పెరిగిందని అధికారులు తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: