
మిరాయ్ మూవీ విడుదల అయిన రెండవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 8.25 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. ఇక మీడియం రేంజ్ హీరోలలో మిరాయ్ సినిమా విడుదల అయిన రెండవ రోజు అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో మొదటి స్థానంలో నిలిచింది. నాగ చైతన్య హీరో గా రూపొందిన తండెల్ మూవీ విడుదల అయిన రెండవ రోజు 7.42 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి రెండవ స్థానంలో కొనసాగుతూ ఉండగా , సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొందిన టిల్లు స్క్వేర్ మూవీ 7.36 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి మూడవ స్థానంలో కొనసాగుతుంది. ధనుష్ హీరో గా రూపొందిన కుబేర సినిమా 7.21 కోట్ల కలెక్షన్లను వసూలు చేసే నాలుగవ స్థానంలో కొనసాగుతోంది. ఇక పంజా వైష్ణవ్ తేజ్ హీరో గా రూపొందిన ఉప్పెన సినిమా 6.86 కోట్ల కలెక్షన్లతో ఐదవ స్థానంలో కొనసాగుతుంది.