నందమూరి నట సింహం బాలకృష్ణ తన కెరీర్ లో ఎన్నో సినిమాలను వదిలేశాడు. అలా వదిలేసిన సినిమాలలో కొన్ని మంచి విజయాలను సాధిస్తే , కొన్ని అపజయాలను అందుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇకపోతే బాలకృష్ణ వదిలేసిన ఒక సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించాడు. కానీ పవన్ కళ్యాణ్ కు ఆ సినిమా ద్వారా మంచి విజయం దక్కలేదు. ఇంతకు బాలకృష్ణ రిజెక్ట్ చేసిన మూవీ ఏది ..? బాలకృష్ణ రిజాక్ట్ చేసిన ఏ మూవీ లో పవన్ కళ్యాణ్ నటించారు ..? ఆ సినిమా బాక్సా ఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుంది ..? అనే వివరాలను తెలుసుకుందాం.

కొన్ని సంవత్సరాల క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ "అన్నవరం" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో ఆసిన్ హీరోయిన్గా నటించింది. ఈ మూవీ అన్నా చెల్లెలు సెంటిమెంట్ తో రూపొందింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. కానీ ఈ సినిమా లోని పవన్ కళ్యాణ్ నటనకు మాత్రం ప్రేక్షకుల , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. ఇకపోతే ఈ సినిమాను మొదట పవన్ కళ్యాణ్ తో కాకుండా బాలకృష్ణ తో చేయాలి అని మేకర్స్ అనుకున్నారట.


అందులో భాగంగా బాలకృష్ణ ను కలిసి కథను కూడా వివరించారట. కానీ బాలకృష్ణ కొన్ని కారణాల వల్ల ఆ సమయం లో ఈ సినిమాలో నటించలేను అని చెప్పాడట. దానితో ఈ మూవీ మేకర్స్ పవన్ కళ్యాణ్ ను కలిసి ఈ మూవీ కథను వివరించగా ఆయనకు ఈ సినిమా స్టోరీ నచ్చడంతో ఈ మూవీ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. బాలకృష్ణ రిజక్ట్ చేసిన ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ హీరో గా నటించగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: