
సెప్టెంబర్ 25వ తేదీన ఈ చిత్రాన్ని గ్రాండ్ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదల చేయడానికి మూవీ మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. సినిమాకి సంబంధించిన ప్రమోషన్లు కూడా వేగంగా పూర్తి అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఈ చిత్రంలో శక్తివంతమైన గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్స్, సాంగ్స్—అన్ని కలిపి సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు ఎప్పుడూ కనిపించని స్టైలిష్ లుక్లో కనిపిస్తుండటం అభిమానుల్లో మరింత ఉత్సాహం రేపుతోంది. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఆయన అందించిన పాటలు సినిమాపై మరింత మ్యూజికల్ హైప్ పెంచాయి. ఇప్పటికే విడుదలైన ‘సువ్వి సువ్వి’ "ఫైర్ స్ట్రోమ్ "పాట యూట్యూబ్‌లో రికార్డులు బద్దలు కొడుతూ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. అదేవిధంగా ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది.
అంతేకాదు, పవన్ కళ్యాణ్, డైరెక్టర్ సుజిత్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన ఫోటో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ ముగ్గురు టాప్ మోస్ట్ టాలెంట్స్ ఒకే ఫ్రేమ్‌లో ఉండటం అభిమానుల్లో అమితానందాన్ని రేపింది. “ఈ ముగ్గురు లెజెండ్స్‌ని ఒకే ఫ్రేమ్‌లో చూడడానికి రెండు కళ్లూ చాలట్లేదు” అంటూ అభిమానులు సోషల్ మీడియాలో ఎమోషనల్ కామెంట్స్ చేస్తున్నారు. కొద్ది రోజులలోనే థియేటర్స్‌లో ఈ చిత్రం ‘ఓజీ’ ప్రేక్షకుల ముందుకు రానుండటంతో ఫ్యాన్స్ ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఈ సినిమాకి సంబంధించిన ప్రతి అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో, ‘ఓజీ’ రిలీజ్ కోసం కౌంట్‌డౌన్ ప్రారంభమైపోయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే కాకుండా మొత్తం సినీ ప్రేక్షకులు ఈ సినిమాకి మైండ్‌బ్లోయింగ్ రెస్పాన్స్ ఇవ్వబోతున్నారని ట్రేడ్ వర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి.