టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా, యువ దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “ఓజి”. ఈ చిత్రంపై స్టార్టింగ్ నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా ఈ సినిమాను చెప్పాలి. అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా కోసం ఆ బిగ్ డే చివరికి వచ్చేసింది. ఇక విడుదల ముందు వరకు అనుకున్నట్టుగానే న‌డుస్తున్నా... రిలీజ్ సమయానికి కొన్ని అడ్డంకులు ఎదురయ్యాయి. ముఖ్యంగా యూఎస్ మార్కెట్‌లో కంటెంట్ డెలివరీ టైమ్‌కు చేరకపోవడం వల్ల షోలు వాయిదా పడతాయన్న వార్తలు బయటకు వచ్చాయి. దీంతో అక్కడి అభిమానులు, డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన చెందారు. పెద్ద ఎత్తున బుకింగ్స్ ఓపెన్ అయిన నేపథ్యంలో ఇది పెద్ద ప్రాబ్ల‌మ్‌గా మారింది.


అయితే చివరికి ఆ సమస్యలు అన్నీ పరిష్కరమైనట్టు సమాచారం. తాజాగా ఓజి సినిమా క్యూబ్ సిస్టమ్‌కు కంటెంట్ డెలివరీ అయిపోయిందని, ఆన్ టైమ్ షోలు పడేలా ఏర్పాట్లు జరిగాయని టాక్ వినిపిస్తోంది. దీంతో యూఎస్ సహా అన్ని చోట్లా అభిమానులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫస్ట్ డే ఫస్ట్ షో ఫ్యాన్స్ ఎంజాయ్ చేసేందుకు అంద‌రూ రెడీ అవుతున్నారు. కంటెంట్ విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ పవర్‌పుల్ లుక్, సుజీత్ స్టైలిష్ మేకింగ్, థమన్ మ్యూజిక్ ఇప్పటికే మంచి హైప్ క్రియేట్ చేశాయి. ట్రైలర్‌తోనే అంచనాలు ఆకాశాన్నంటగా, రిలీజ్ ముందు ఉన్న చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఇప్పుడు క్లియర్ కావడంతో అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. ఏదేమైనా ఓజీ షోకు అంతా రెడీ అయిపోయింది. ఇక‌ బాక్సాఫీస్ వద్ద ఓజి విధ్వంసం తప్పదని అభిమానులు అంటున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: