- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజి సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే, ఇప్పుడు తాజాగా తేజ సజ్జా హీరోగా నటించిన మిరాయ్ టీం ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. నిజానికి, మిరాయ్ సినిమా సెప్టెంబర్ 12వ తేదీన రిలీజ్ అయి, ఇప్పటికీ మంచి జోష్ కనబరుస్తోంది. చాలా చోట్ల ఇప్పటికీ హౌస్‌ఫుల్స్ నడుస్తున్నాయి. అయితే, ఇప్పుడు ఓజి సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అదేమిటంటే, రేపు మిరాయ్ ఆడుతున్న అన్ని సినిమా థియేటర్ల స్క్రీన్‌లను ఓజి సినిమాకి కేటాయించబోతున్నారు. ఇప్పుడు ఓజి సినిమాకి రిలీజ్ రోజైన గురువారం నాడు థియేటర్లు కేటాయించి, మళ్లీ శుక్రవారం నుంచి మిరాయ్ సినిమా ప్రదర్శించేలా చర్యలు తీసుకున్నారు. మిరాయ్ సినిమా ఇప్పటికే 150 కోట్ల దిశగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో పవన్ కల్యాణ్ మీద గౌరవంతోనే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మళ్లీ శుక్రవారం నుంచి యధావిధిగా మిరాయ్ సినిమాను ప్రేక్షకుల వీక్షించవచ్చు. సినిమాకి అదనంగా ఆడియన్స్ అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న వైబ్ ఉంది సాంగ్ కూడా నిన్ననే జోడించిన సంగతి తెలిసిందే. ఒక రకంగా, ఇది ప్రస్తుత ఇండస్ట్రీలో హెల్తీ కాంపిటీషన్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు మిరాయ్ టీం మీద ప్రశంసల వర్షం కురుస్తోంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: