
ముఖ్యంగా పోటీగా ఇంకో పెద్ద సినిమా లేకపోవడం వల్ల ఓజీ కు బాక్సాఫీస్ వద్ద గోల్డెన్ రన్ ఖాయం అంటున్నారు ట్రేడ్ సర్కిల్స్. పవర్ స్టార్ వింటేజ్ లుక్, ఆయన ఎనర్జీ, ఆ మాస్ స్వాగ్.. ఇవన్నీ డైరెక్టర్ సుజిత్ స్క్రీన్ పై స్టైలిష్ గా ప్రెజెంట్ చేశాడని బజ్. థమన్ ఈ సినిమా కోసం స్పెషల్ ఎఫర్ట్ పెట్టిన విషయం తెలిసిందే. ఫస్ట్ గ్లింప్స్ నుంచే మ్యూజిక్, బిజిఎం వేరే లెవెల్ లో ఉండబోతుందని అర్థమైంది. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక సినిమాకి సౌల్ అయ్యేలా థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ని డిజైన్ చేశాడని టాక్. హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ రోల్ కి కూడా మంచి ఎమోషనల్ టచ్ ఇచ్చారని తెలుస్తోంది. ఓజీ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వేర్వేరు రికార్డులు సృష్టించింది.
ఓవర్సీస్ బుకింగ్స్ తోనే వసూళ్ల హవా మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లోనూ థియేట్రికల్ రైట్స్ భారీ రేంజ్ లో అమ్ముడయ్యాయి. ఫ్యాన్స్ కోసం 1000 రూపాయల టికెట్ ధర ఫిక్స్ చేసినా కూడా డిమాండ్ తగ్గలేదంటే పవర్ స్టార్ క్రేజ్ ఎలాంటి స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక బాక్సాఫీస్ విషయానికి వస్తే, ఫస్ట్ డే నుంచే రికార్డులు బద్దలయ్యేలా వసూళ్లు వస్తాయని ట్రేడ్ అంచనా. ఓజీ కేవలం మరో సినిమా కాదు.. పవన్ కళ్యాణ్ స్టామినా, ఆయన క్రేజ్, ఆయన ఫ్యాన్స్ ఎమోషన్ కి మాస్ ఫుల్ ఫీస్ట్. ఈ రాత్రే మొదటి టాక్ బయటకు వస్తుంది. కానీ ఏకగ్రీవంగా అందరూ చెబుతున్నది ఒక్కటే – ఓజీ అంచనాలను అందుకుంటే, పవర్ స్టార్ బాక్సాఫీస్ వద్ద మరోసారి తుఫాన్ సృష్టించడంలో ఎలాంటి సందేహం లేదు.