
ఇక ఈ సినిమాలో రిషబ్ శెట్టి సరసన యువరాణి పాత్రలో రుక్మిణి వసంత్ కనిపించనుంది. గుల్షన్ దేవయ్య కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను దర్శకుడిగా రిషబ్ శెట్టి ఒక దృశ్య కావ్యంలా తీర్చిదిద్దుతున్నారు. అరవింద్ ఎస్ కశ్యప్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. హోంబలే ఫిలింస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ట్రైలర్ రిలీజ్ అయ్యాక సినిమా మేకింగ్ గురించి, గ్రాండియర్ గురించి మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా విజువల్స్ గురించి, హోంబలే ఫిలింస్ నిర్మాణ విలువల గురించి చర్చ జరుగుతోంది. ఈ ట్రైలర్ రిలీజ్ అయ్యాక సినిమా మీద ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఈ సినిమా ఎప్పడెప్పుడు వస్తుందా? అని ఆడియన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ చిత్రం అక్టోబర్ 2న కన్నడతో పాటు హిందీ, తెలుగు, మలయాళం, తమిళం, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.