విజయ్ దేవరకొండ రష్మిక మందన్నా ఎప్పుడైతే ప్రేమలో పడ్డారో అప్పటి నుంచి అభిమానులు వీరి పెళ్లి కోసం కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలోనే యువ జంట ఎంగేజ్మెంట్ చేసుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది. కానీ ఈ వేడుకను వారు అత్యంత సీక్రెట్ గా చేసుకున్నారు. కనీసం ఒక్క ఫోటో కూడా బయటకు రాలేదు. అయితే వీరి నిశ్చితార్థ వేడుక గురించి ఎప్పుడైతే వార్తలు బయటకు వచ్చాయో అప్పటినుంచి కొంతమంది జ్యోతిష్యులు రష్మిక,విజయ్ దేవరకొండ జాతకం  ఎలా ఉందో చెప్తున్నారు.. మరి వీరి జాతకంలో ఏదైనా దోషం ఉందా.. పెళ్లి తర్వాత కెరియర్ ఎలా సాగుతుంది అనేది ఇప్పుడు చూద్దాం.. రష్మిక మందన్నా సినీ ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆమె జీవితంలో ప్రతికూల అంశం ఏదైనా ఉందంటే అది ఆమె ఎంగేజ్మెంట్ వేడుకే. 

అయితే ఈమె గతంలో నటుడు రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ జరిగింది. ఆ తర్వాత కొద్ది రోజులకు వారు విడిపోయాడు. అక్కడితో అది ముగిసిపోయింది.. అయితే రష్మిక జాతకం ప్రకారం ఆ ఎంగేజ్మెంట్ రద్దు చేసిన తర్వాతే  ఆమెకి కెరీర్ లో కలిసి వచ్చిందని చాలామంది పండితులు చెబుతున్నారు.. రష్మిక జాతకం ప్రకారం అనుకూలత లేని బంధాల్లో ఉంటేనే ఆమెకు ప్రతికూల ఫలితాలు వస్తాయనేది జ్యోతిష్కులు చెబుతున్న మాట. ఇక విజయ్ దేవరకొండ జాతకం విషయానికి వస్తే..ఆయన జీవితాన్ని ప్రభావితం చేసే దోషం ఉన్నట్లు జ్యోతిష్కులు చెబుతున్నారు. శుక్రుడు నీచస్థితిలో ఉండడం వల్ల విజయ్ కెరియర్ సమస్యలతో పాటు వివాహ సంబంధ సమస్యలు తప్పవని అంచనా వేస్తున్నారు. కానీ రష్మిక విజయ్ దేవరకొండ జీవితంలోకి వస్తే ఈయన జాతకం  చాలా బలంగా తయారవుతుందని చెప్పారు.

కర్కాటక లగ్నం కారణంగా విజయ్ లో ఉన్న రక్షించే స్వభావం రష్మికకు మానసిక ధైర్యాన్ని కూడా ఇవ్వవచ్చని తెలియజేశారు. ఈ విధంగా ఒకరి జాతకాలు మరొకరికి సెట్ అయ్యాయని అన్నారు. ముఖ్యంగా రష్మిక జాతకంలోని అసాధారణ అదృష్టం వల్ల  దేవరకొండ కుటుంబ ప్రతిష్టపై సానుకూల ప్రభావం చూపించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనివల్ల ఆమె భవిష్యత్తులో లోక్ సభ ఎంపీ అయ్యే అవకాశం ఉందని జ్యోతిష్యులు తెలియజేస్తున్నారు. అంతేకాదు ఆమె కర్ణాటక రాష్ట్రం నుంచి లోక్ సభ ఎన్నికల్లో  పోటీ చేసే అవకాశం ఉందని, రష్మిక వల్ల విజయ్ దేవరకొండ కుటుంబానికి ప్రజాదరణ మరింత పెరుగుతుందని తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: