పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజి సినిమాను సెప్టెంబర్ 25 వ తేదీన విడుదల చేశారు. ఈ సినిమాకు సంబంధించిన 11 రోజుల బాక్సా ఫీస్ రన్ ఇప్పటివరకు కంప్లీట్ అయింది. 11 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా మంచి కలెక్షన్లు దక్కాయి. మరి 11 రోజుల్లో ఈ సినిమాకు ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లు దక్కాయి. ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ ఇంకా ఎన్ని కలెక్షన్లను సాధిస్తే హిట్ స్టేటస్ను అందుకుంటుంది అనే వివరాలను తెలుసుకుందాం.

11 రోజుల్లో ఈ సినిమాకు నైజాం ఏరియాలో 49.72 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ లో 17.17 కోట్లు , ఉత్తరాంధ్రలో 15.73 కోట్లు , ఈస్టు లో 11.96 కోట్లు , వెస్ట్ లో 8 కోట్లు , గుంటూరు లో 10.71 కోట్లు , కృష్ణ లో 9.39 కోట్లు , నెల్లూరు లో 4.50 కోట్లు , కర్ణాటక లో 10 కోట్లు , రెస్ట్ ఆఫ్ ఇండియాలో 4.27 కోట్లు , ఓవర్ సిస్ లో 31.75 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 11 రోజుల్లో 173.20 కోట్ల షేర్ ... 285.70 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 172.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 174 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. దానితో ఈ సినిమా మరో 80 లక్షల కలెక్షన్లను సాధిస్తే ప్రపంచ వ్యాప్తంగా బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ను అందుకుంటుంది. ఈ మూవీ కి సుజిత్ దర్శకత్వం వహించగా ... ప్రియాంక అరుల్ మోహన్మూవీ లో హీరోయిన్గా నటించింది. డి వి వి దానయ్య నిర్మించిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందించగా ... ఇమ్రాన్ హష్మీ ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. ప్రకాష్ రాజ్ , శ్రేయ రెడ్డి , అర్జున్ దాస్ ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: