
అయితే ఆమె కెరీర్ ట్రాక్ రికార్డ్ చూసుకుంటే హిట్ సినిమాలు ఎక్కువే అయినా, ఒక సినిమా మాత్రం అభిమానులను గట్టిగా నిరాశపరిచింది. అదే — "ఆడవాళ్లు మీకు జోహార్లు". శర్వానంద్–రష్మిక కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలకు ముందు భారీ అంచనాలు సృష్టించింది. ట్రైలర్, సాంగ్స్ కూడా మంచి స్పందన తెచ్చుకున్నాయి. కానీ రిలీజ్ అయిన తర్వాత మాత్రం ప్రేక్షకులు, విమర్శకులు ఇద్దరూ నిరాశ చెందారు. సినిమా కథ బాగానే ఉన్నా, ఎగ్జిక్యూషన్‌లో లోపాలు ఉండటం, స్క్రీన్‌ప్లే లో గా ఉండటం వల్ల బాక్సాఫీస్ వద్ద సినిమా కూలిపోయింది. అంతే కాకుండా, రష్మిక అభిమానులు కూడా ఈ సినిమా ఆమె కెరీర్‌లో ఒక తప్పు నిర్ణయమని పేర్కొన్నారు. “ఇంత సెన్స్ ఉన్న హీరోయిన్ ఈ ప్రాజెక్ట్ ఎందుకు చేసిందో అర్థం కావడం లేదు… బుద్ధిలేకనే చేసింది అనిపిస్తుంది” అంటూ సోషల్ మీడియాలో ఘాటైన కామెంట్లు పెట్టారు.
అప్పటి వరకూ “హిట్ హీరోయిన్” అనే ట్యాగ్‌తో ఉన్న రష్మికకు, ఈ సినిమా ఒక చిన్న షాక్ ఇచ్చింది. కానీ ఆమె దాన్ని పెద్దగా పట్టించుకోకుండా ముందుకు సాగింది. ఎందుకంటే ఒక్క ఫ్లాప్‌తో కెరీర్ ఆగిపోదు. ఆ తర్వాత వచ్చిన సినిమాలతో ఆమె తిరిగి సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చి పాన్ ఇండియా స్టార్‌గా నిలిచింది.ఇప్పుడు మళ్లీ ఈ మధ్య సోషల్ మీడియాలో “రష్మిక చేసిన ఫ్లాప్ సినిమాలు” అనే టాపిక్ ట్రెండ్ అవుతోంది. “ఆడవాళ్లు మీకు జోహార్లు” సినిమాను ఫ్యాన్స్ మళ్లీ హైలైట్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇదే సమయంలో ఆమె వ్యక్తిగత జీవితం, విజయ్ దేవరకొండతో ఉన్న రూమర్స్ కూడా హాట్ టాపిక్‌గా మారాయి. “ఇద్దరూ కలిసి ఒక సర్ప్రైజ్ ప్రాజెక్ట్‌కి సైన్ చేశారని” అంటూ సోషల్ మీడియాలో వార్తలు ఊపందుకుంటున్నాయి.
ఈ నేపథ్యంలో రష్మిక చేసిన గత ఫ్లాప్స్ మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొంతమంది ఫ్యాన్స్ ఆమెపై విమర్శలు చేస్తుంటే, మరికొంత మంది మాత్రం ఆమెకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. “ఒక సినిమా ఫెయిల్ అవ్వడం అంటే ఆ ఆర్టిస్ట్‌లో తప్పేమీ ఉండదు, కాస్ట్ అండ్ టైమ్ కారణాలు కూడా ఉండొచ్చు” అంటూ ఆమెను సమర్థిస్తున్నారు.అయితే రష్మిక మాత్రం ఈ కామెంట్లన్నింటినీ పట్టించుకోకుండా తన వర్క్‌పైనే ఫోకస్ పెట్టిందని తెలిసింది. ప్రస్తుతం ఆమె హిందీ, తెలుగు, తమిళ, సినిమాలతో బిజీగా ఉంది. త్వరలోనే "యానిమల్ 2" లో మరింత పవర్‌ఫుల్‌గా కనిపించబోతోందని సమాచారం..!!