మెగాస్టార్ చిరంజీవితో మరోసారి సినిమా చేయడానికి దర్శకుడు బాబీ కొల్లి రెడీ అవుతున్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింద‌ది. ఆ సినిమాతో బాబీకి మెగా ఫ్యాన్స్ మద్దతు లభించింది. ఇప్పుడు ఆయన తన తదుపరి ప్రాజెక్ట్‌ను చిరంజీవితో తెరకెక్కించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం సినిమా ప్రీ - ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ కొత్త సినిమా చిరంజీవి కెరీర్‌లో మరో మాస్ ఎంటర్‌టైనర్గా ఉండబోతోందని టాక్ వినిపిస్తోంది. బాబీ ఈసారి కూడా మెగా స్టార్ ఇమేజ్‌కి తగిన కథను రెడీ చేశాడట. అయితే ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ల ఎంపిక పనులు పూర్తి వేగంగా జరుగుతున్నాయి.


ఈ సినిమాలో చిరు సరసన ఇద్దరు ప్రముఖ హీరోయిన్లు నటించబోతున్నారట‌. వాటిలో ఫ‌స్ట్‌ రాశి ఖన్నా పేరు దాదాపు ఖరారైనట్లు తెలిసింది. ప్రస్తుతం ఆమె పవన్ కళ్యాణ్‌తో కలిసి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో నటిస్తోంది. అదే సమయంలో బాబీ నుంచి వచ్చిన ఆఫర్ తో ఆమె ఎగిరి గంతేస్తోంద‌ట‌. రాశి ఖన్నా ఈ ప్రాజెక్ట్‌లో భాగం అయితే, ఇది ఆమె కెరీర్‌లో పెద్ద మైలురాయి అవుతుంది. రెండో హీరోయిన్‌గా మాళవిక మోహనన్‌ను తీసుకునేందుకు దర్శకుడు బాబీ ప్రయత్నిస్తున్నాడట. ఈ మలయాళ బ్యూటీ ఇప్పటికే తమిళం, హిందీ భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు మెగాస్టార్‌తో నటించే అవకాశం వస్తే, ఆమె దానిని వదులుకునే ప్రసక్తే లేదని టాలీవుడ్ టాక్.


ఈ భారీ ప్రాజెక్టుకు ఎస్‌.ఎస్‌. థమన్ సంగీతం అందిస్తున్నారు. ‘వాల్తేరు వీరయ్య’లో అందించిన ఎనర్జిటిక్ ఆల్బమ్ తర్వాత థమన్ నుండి మరింత పవర్‌ఫుల్ మ్యూజిక్ కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. త్వరలో ఈ సినిమా అధికారికంగా లాంఛ్ అయిన వెంట‌నే సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: