డైనమిక్ హీరోగా పేరు సంపాదించుకున్న మంచు విష్ణు గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు . మంచు విష్ణు ప్రధాన పాత్రలో తాజాగా నటించిన డివైన్ బ్లాక్ బస్టర్ మూవీ కన్నప్ప . ఇక ఇప్పుడు ఈ మూవీ బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యింది . థియేటర్లు మరియు ఓటీపీలలో సంచలనం సృష్టిస్తున్న ఈ మూవీని దివాలి పండుగ సందర్భంగా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రచారం చేస్తున్నారు మూవీ టీం . 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ మరియు ఆవా ఎంటర్టైన్మెంట్స్ పథకాలపై డా ఎం మోహన్ బాబు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మూవీకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించడం జరిగింది .


ఇక ఈ దివాళి పండుగ నువ్వు మరింత ప్రత్యేక చేసేందుకు కన్నప్ప మూవీని అక్టోబర్ 19న మధ్యాహ్నం 12 గంటలకు జెమినీ టీవీలో ప్రసారం చేస్తున్నారు . ఇక ఈ సందర్భంగా చిత్ర బృందం ఒక ప్రత్యేక పోస్టర్ను కూడా విడుదల చేసి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడం జరిగింది . గతంలో థియేటర్లలో విడుదలై కన్నప్ప మూవీ ప్రేక్షకులు మరియు మీడియా వర్గాల నుంచి విశ్లేషిక సంపాదించుకోవడం మనందరం చూసాం . భక్తితో కూడిన కథ మరియు అద్భుతమైన విజువల్స్ ప్రేక్షకులను కట్టిపడే సాయని చెప్పుకోవచ్చు .


ఇక అనంతరం ఓటీడీలో విడుదల అయినప్పుడు కూడా ఈ మూవీ టాప్ ట్రెండింగ్ లో నిలిచి తన సత్తాను చాటింది . ఇక ప్రజెంట్ టెలివిజన్ ప్రీమియర్ తో ఇంటిళ్లపాదిని అలరించేందుకు సిద్ధమయ్యింది . ఇక ఈ మూవీలో విష్ణు తో పాటు ఇండియా స్టార్లు అయినటువంటి ప్రభాస్ మరియు బాలీవుడ్ కిలాడి అక్షయ్ కుమార్ మలయాళం సూపర్ స్టార్ మోహన్లాల్, హాస్య నటుడు బ్రహ్మానందం మరియు శరత్ కుమార్ వంటి దిగ్గజా నటీనటులు ఈ మూవీలో నటించి అలరించారు . దాదాపు 8 సంవత్సరాల అనంతరం నాన్ నెట్వర్క్ ఒకేసారి నాలుగు భాషల్లో ఒకే చిత్రాన్ని ప్రసారం చేస్తుండడం కన్నప్పకు దక్కిన మరో గౌరవంగా చిత్ర బృందం చెబుతుంది . ఇక ఈ మూవీ టీవీ ప్రేక్షకులను ఏ విధంగా అలరిస్తుందో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: