కే.ఎస్.రవికుమార్ డైరెక్షన్లో రజినీకాంత్ హీరోగా..సౌందర్య హీరోయిన్ గా.. రమ్యకృష్ణ నెగిటివ్ రోల్ పోషించిన నరసింహ మూవీ అందరూ చూసే ఉంటారు. ఈ సినిమా తమిళంలో పడియప్పా పేరుతో విడుదలైంది. తెలుగులో నరసింహగా వచ్చింది.ఇక ఈ సినిమాలో రజినీకాంత్ యాక్టింగ్, పాటలు, సౌందర్య అమాయకత్వం, రమ్యకృష్ణ విలనిజం ప్రతి ఒక్కటి అద్భుతంగా ఉంటాయి. ఇక ఈ సినిమాలో రజినీకాంత్ తో పాటు శివాజీ గణేషన్ కీలక పాత్రలో నటించారు. రజినీకాంత్ తండ్రిగా శివాజీ గణేషన్ ఇందులో కనిపించారు. వీళ్ళు మాత్రమే కాకుండా లక్ష్మి, సితార,నాజర్,రాధా రవి, అబ్బాస్,సెంథిల్, అను మోహన్, మనీ వణ్ణన్,ప్రీత, అనిత వెంకట్,ప్రకాష్ రాజ్,సత్యప్రియ, మన్సూర్ అలీ ఖాన్, రోబో శంకర్ వంటి ఎంతోమంది నటీనటులు ఈ మూవీలో కీలక పాత్రలో నటించారు. అలా అరుణాచల సినీ క్రియేషన్స్ బ్యానర్ పై కే. సత్యనారాయణ,కే.విటల్ ప్రసాద్ రావు, ఎం.వీ.కృష్ణారావు,పి.ఎల్. తేనప్పన్ కలిసి నిర్మించిన నరసింహ మూవీకి కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించారు. 

ఇక ఈ సినిమా కథా కథనం స్క్రీన్ ప్లే తో పాటు మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక ఈ మూవీకి ఆస్కార్ విన్నర్ అయినటువంటి ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందించడంతో సినిమాకి భారీ హైప్ వచ్చింది.అయితే ఈ సినిమా ఎంత అద్భుతంగా ఉంటుందో చెప్పనక్కర్లేదు. అయితే ఈ సినిమాలో ఓ చిన్న సీన్ చేయడం కోసం రజినీకాంత్ చాలా బతిమిలాడించుకున్నారట. ఆ సీన్ ఏంటంటే రమ్యకృష్ణ సోదరుడి పాత్రలో నటించిన నాజర్ రజినీకాంత్ చెల్లెల్ని పెళ్లి చేసుకోవాలి.కానీ రజినీకాంత్ తండ్రి సంపాదించిన ఆస్తిపాస్తులు అన్ని పోగొట్టుకోవడంతో ఆస్తిపాస్తులు లేని ఇంటి నుండి పిల్లను తెచ్చుకోవడం ఇష్టం లేని రమ్యకృష్ణ తండ్రి తన కొడుకు నాజర్ కి వేరే అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాడు.

ఆ సమయంలో నాజర్ ని పెళ్లి చేసుకోవాలి అనుకున్న రజినీకాంత్ చెల్లెలు చాలా బాధపడుతుంది.దాంతో తిండి తినకుండా కూర్చుంటుంది. ఆ సమయంలో రజినీకాంత్ వచ్చి చెల్లెల్ని ఓదార్చి ఆమెకు అన్నం తినిపిస్తూ కన్నీళ్లు పెట్టుకోవాలి.అయితే ఈ సీన్ చేయడానికి మొదట రజినీకాంత్ ససేమిరా అన్నారట.. కానీ దర్శకుడు కేఎస్ రవికుమార్ చాలా బతిమిలాడడంతో చివరికి రజినీకాంత్ సీన్ చేయడానికి ఒప్పుకున్నారట. ఈ సీన్ కోసం రజినీకాంత్ ని చాలా బతిమిలాడాల్సి వచ్చిందని డైరెక్టర్ కె. ఎస్.రవికుమార్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: