గత కొంత కాలంగా ఇండియన్ సినిమా పరిశ్రమకు సంబంధించిన అనేక సినిమాలు రీ రిలీజ్ అవుతున్న విషయం మన అందరికి తెలిసిందే. మరి ముఖ్యంగా ఏదైనా హీరోకి సంబంధించిన పుట్టిన రోజు వచ్చింది అంటే చాలు ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటించిన ఏదో ఒక సినిమాను విడుదల చేయడానికి మేకర్స్ పెద్ద ఎత్తున సన్నహాలు చేస్తున్నారు. అలాగే ఆ హీరో అభిమానులు కూడా తమ అభిమాన నటుడి పుట్టిన రోజు నాడు ఆయన సినిమాను థియేటర్లో చూడాలి అని అత్యంత ఆసక్తిని చూపిస్తూ ఉండడంతో కొంత మంది హీరోల సినిమాలకు రీ రిలీజ్ లో భాగంగా అద్భుతమైన కలెక్షన్లు కూడా దక్కుతున్నాయి.

అలాగే మరికొన్ని సందర్భాలలో మొదటి రిలీజ్ లో ప్రేక్షకుల నుండి అనుకున్నంత స్థాయి రెస్పాన్స్ రాని సినిమాలను కూడా రీ రిలీజ్ చేస్తూ వస్తున్నారు. అలాంటి సినిమాలు కూడా రీ రిలీజ్ లో భాగంగా అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక అలాంటి కోవకు చెందిన ఓ సినిమానే మరికొన్ని రోజుల్లో రీ రిలీజ్ చేయనున్నారు. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. కొన్ని సంవత్సరాల క్రితం ధనుష్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్గా 3 అనే మూవీ రూపొందిన విషయం మన అందరికి తెలిసిందే. ఈ మూవీ మంచి అంచనాల నడుమ విడుదల అయింది.
కానీ ఆ స్థాయి విజయాన్ని మాత్రం ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర సొంతం చేసుకోలేదు. ఈ మూవీ కి ఆ తర్వాత ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ రావడం మొదలు అయింది. ఈ సినిమాను వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నెలలో ప్రపంచ వ్యాప్తంగా రీ రిలీజ్ చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు. మరి మొదటి రిలీజ్ లో బాక్సా ఫీస్ దగ్గర పెద్ద స్థాయి కలెక్షన్లను వసూలు చేయడంలో విఫలం అయిన ఈ సినిమా రీ రిలీజ్ లో భాగంగా ఏ రేంజ్ కలెక్షన్లను వసూలు చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: