 
                                
                                
                                
                            
                        
                        స్టోరీ విషయానికి వస్తే:.
బాహుబలి సినిమా స్టోరీ అందరికీ తెలిసిందే.మాహిష్మతి సామ్రాజ్యపు రాజమాతగా శివగామి (రమ్యకృష్ణ) , తన ప్రాణాలను త్యాగం చేసి మహేంద్ర బాహుబలి (ప్రభాస్) ని కాపాడుతుంది. ఒక గూడెంలో పెరిగి పెద్దవాడైన మహేంద్ర బాహుబలి.. అవంతిక (తమన్నా) తో ప్రేమలో పడతారు. అలా అవంతిక ఆశయం నెరవేర్చడానికి మాహిష్మతి రాజ్యానికి వెళ్లిన మహేంద్ర బాహుబలి అక్కడ బంధీగా ఉన్న దేవసేన (అనుష్క శెట్టి) తీసుకువచ్చి అవంతికకు అప్పజెప్పాలి అనుకుంటారు. దేవసేనను విడిపించడానికి వెళ్లిన మహేంద్ర బాహుబలి కి కొన్ని నిజాలు తెలుస్తాయి. బందీగా ఉన్న దేవసేన తన తల్లి అని, బళ్లాలదేవుడు (రానా) కుట్రతోనే తన తండ్రి అమరేంద్ర బాహుబలిని చంపారనే విషయాన్ని తెలుసుకుంటారు. కట్టప్ప (సత్యరాజ్) సహాయంతో మహేంద్ర బాహుబలి మాహిష్మతి రాజ్యం పైన దండయాత్ర చేసి చివరికి బళ్లాలదేవుడిని అంతం చేస్తారు. ఇదే బాహుబలి:ది ఎపిక్ స్టోరీ.
బాహుబలి సినిమా ముందే అందరికీ తెలిసిందే. ముఖ్యంగా మొదటి భాగం చూసినప్పుడు బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపారో తెలియదు కాబట్టి అందరూ రెండవ పార్ట్ కోసం చాలా ఎక్సైటింగ్ గా చూశారు. కానీ బాహుబలి: ది ఎపిక్ విషయంలో రాజమౌళి మరొకసారి మ్యాజిక్ చేశారు. ఎక్కడ బోర్ కొట్టకుండా భారీ యాక్షన్ సన్నివేశాలు ,ఎలిమినేషన్స్ తో కథను చెప్పుకొచ్చారు. సుమారుగా 6:30 గంటల సినిమాను 3:45 నిమిషాలకే తగ్గించారు. అయితే ఈ సినిమా థియేటర్లో చూస్తూ ఉంటే కొత్తగా చూసిన ఫీలింగే అభిమానులలో, ప్రేక్షకులలో కలుగుతోందట.
రెండు భాగాలలో ప్రేక్షకులకు బాగా నచ్చిన సీన్స్ హైలెట్ చేశారు. బళ్లాలదేవుడి పట్టాభిషేకం, కాలకేయులతో యుద్ధం, తల నరికే సన్నివేశాలు అన్నీ కూడా హైలెట్ గానే ఉన్నాయి.
కిచ్చా సుదీప్ పాత్రలతో పాటుగా మరికొన్ని కీలకమైన సీన్స్ ని పాటలను తొలగించారు. కానీ ఎక్కడ కూడా కథను మిస్ కానివ్వకుండా రాజమౌళి ప్లాన్ చేసి మరి సినిమాని రిలీజ్ చేశారు.
సినిమా నిడివి విషయంలో కాస్త ఇబ్బందిగానే ఉందనే విధంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మరో 20 నిమిషాలు తగ్గించి ఉంటే బాగుండేదేమో అన్నట్టుగా తెలుపుతున్నారు.
మొత్తానికి బాహుబలి 1&2 ది ఎపిక్ మాత్రం ఒక విజువల్ వండర్ గా చూపించారు డైరెక్టర్ రాజమౌళి.
నటీనటులు:
ప్రభాస్, రానా ఇందులో కీలకమైన పాత్రలో కనిపించారు. తమ కెరియర్లోనే ది బెస్ట్ యాక్టింగ్ గా ఆకట్టుకున్నారు.
ప్రభాస్, అనుష్క జోడి మరొకసారి అభిమానులను ఆకట్టుకుంది.
రమ్యకృష్ణ, తమన్నా, సత్యరాజ్ ,సుబ్బరాజు ప్రతి ఒక్కరూ అద్భుతంగా నటించారు.
పదేళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ అద్భుతమైన సంగీత నేపథ్యంతో ఆకట్టుకుంటోంది. విఎఫ్ఎక్స్ కూడా అదిరిపోయింది.రీ రిలీజ్ లో కూడా బాహుబలి ఒక మైలురాయిగా నిలిచిపోతుందని ప్రేక్షకులు, అభిమానులు తెలుపుతున్నారు.
 
             
                             
                                     
                                             క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి
 క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి