టాలీవుడ్‌లో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన శ్రీలీల ఇప్పుడు సంక‌ట స్థితిలో ఉంద‌నే చెప్పాలి. కావాల్సిన అందం, ట్యాలెంట్, ఎనర్జీ అన్నీ ఉన్నా, ఆమె కెరీర్ ప్రస్తుతం “అన్నీ ఉన్నా... శని ఉన్నట్టు!” అనే సామెతను గుర్తు చేస్తోంది. మొదట్లో వరుస హిట్స్‌తో టాప్ రేంజ్‌కి చేరిన శ్రీలీలకు ఇప్పుడు వరుస ఫ్లాపులు ఇబ్బందిగా మారాయి. ‘ధమాకా’తో ఘన విజయాన్ని అందుకున్న ఆమె, ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో ఆశించిన ఫలితాలు పొందలేకపోయింది. ‘భగవంత్ కేస‌రి’ జ‌స్ట్ ఓకే సినిమా. ‘అదికేశవ’, ‘మాస్ జాతర’ లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. ఈ కారణంగా “శ్రీలీల అంటే కేవలం గ్లామర్‌, డ్యాన్స్ మాత్రమే” అనే నెగటివ్ ట్యాగ్ ఏర్పడింది. ఆమె నటనలో సామర్థ్యం ఉన్నప్పటికీ, రొటీన్ స్క్రిప్టుల్లో ఇరుక్కుపోయింది.


ఇప్పుడు ఈ ఇమేజ్‌ నుంచి బయటపడటానికి శ్రీలీలకు ఒక గోల్డెన్ ఛాన్స్ లభించింది. అదే ‘పరాశక్తి’. ఈ సినిమాకు నేషనల్ అవార్డ్ విజేత సుధ కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. శివకార్తికేయన్‌, అథర్వ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల కీలక పాత్రలో కనిపించనుంది. ఇటీవల విడుదలైన టీజర్‌లో ఆమె లుక్‌, బాడీ లాంగ్వేజ్ పూర్తిగా భిన్నంగా ఉండటంతో అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. సుధ కొంగర సినిమాల్లో మహిళా పాత్రలకు ఎప్పుడూ బలమైన ఇమోషనల్ డెప్త్ ఉంటుంది. ‘గురు’, ‘ఆకాశమే నీ హద్దు’ చిత్రాల్లో ఆ విషయాన్ని స్పష్టంగా చూశాం. అలాంటి దర్శకురాలి సినిమాలో శ్రీలీలకు లభించిన ఈ అవకాశం ఆమె కెరీర్‌కి కొత్త ఊపిరి ఇస్తుంద‌ని అంద‌రూ భావిస్తున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే శ్రీలీల రొటీన్ ఇమేజ్‌ నుంచి బయటపడటమే కాకుండా, నటిగా కొత్త స్థాయికి ఎదగొచ్చు. మొత్తానికి, ‘పరాశక్తి’ శ్రీలీల కెరీర్‌లో “టర్నింగ్ పాయింట్” అవుతుందా అన్నది చూడాలి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: