సినిమా ఇండస్ట్రీ లో కొంత మంది.కి కెరియర్ను మొదలు పెట్టిన అత్యంత తక్కువ సమయం లోనే అద్భుతమైన గుర్తింపు వస్తూ ఉంటుంది. గుర్తింపు వచ్చాక అనేక సినిమాలలో ఆఫర్లు కూడా వస్తూ ఉంటాయి. సినిమాలలో ఆఫర్లు వచ్చే సమయం లోనే నటీ మణులు అత్యంత జాగ్రత్తగా ఉండాలి అని , వారు సెలక్ట్ చేసుకున్న సినిమాలలో స్టోరీ అద్భుతంగా ఉండాలి అని సినిమాలో స్టోరీ అద్భుతంగా లేకపోయినా వారి పాత్ర అయినా అద్భుతంగా ఉండి వారు నటనతో ఆకట్టుకున్నట్లయితే సినిమా బాక్సా ఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయినా కూడా తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకొని మరికొన్ని సినిమాలలో అవకాశాలను దక్కించుకునే ఛాన్స్ బ్యూటీలకు ఉంటుంది అని అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తపరుస్తూ ఉంటారు. అదే వారు నటించిన సినిమాలు అద్భుతమైన విజయం సాధించినట్లయితే వారు గొప్ప స్థాయి నటనను కనబరచకపోయిన కూడా వారికి వరస పెట్టి అవకాశాలు వస్తాయి అనే అభిప్రాయాలను కూడా చాలా మంది వ్యక్తపరుస్తూ ఉంటారు. ఇక కొంత మంది కి కెరియర్ ప్రారంభంలో అద్భుతమైన స్థాయిలో గుర్తింపు వచ్చిన వారు ఆ తర్వాత వరుస పెట్టి అపజయాలను అందుకోవడంతో కెరియర్ డౌన్ ఫాల్ అయిన వారు కూడా ఉన్నారు అలాంటి వారిలో కృతి శెట్టి ఒకరు.

ఈమె ఉప్పెన సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని , మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత ఈమె శ్యామ్ సింగరాయ్ , బంగార్రాజు సినిమాలతో కూడా విజయాలను అందుకుంది. దానితో ఈమె క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. కానీ ఆ తర్వాత ఈమె వరుస పెట్టి సినిమాలు చేసిన అందులో ఏ సినిమా ద్వారా కూడా ఈ బ్యూటీ కి అద్భుతమైన గుర్తింపు రాలేదు. ప్రస్తుతం ఈమెకు చాలా తక్కువ అవకాశాలు దక్కుతున్నాయి. దానితో చాలా మంది కృతి శెట్టి తక్కువ సినిమాలు చేసిన ఆ సినిమాలతో మంచి విజయాలను అందుకున్నట్లయితే ఇప్పటికీ ఎప్పుడో స్టార్ హీరోయిన్ అయ్యేది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ks