కొంత మంది తెలుగు సినీ పరిశ్రమ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న తర్వాత తెలుగు సినిమాల్లో నటించడం కంటే కూడా ఇతర భాష సినిమాల్లో నటించడం పై అత్యంత ఆసక్తిని చూపించిన వారు కూడా ఉన్నారు. అలా టాలీవుడ్ ఇండస్ట్రీ ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న ప్రస్తుతం మాత్రం తెలుగు సినిమాల కంటే కూడా ఇతర భాష సినిమాల్లో నటించడానికి అత్యంత ఆసక్తిని చూపిస్తున్న నటీ మణులలో రాశి కన్నా ఒకరు. ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక తెలుగు సినీ పరిశ్రమలో మంచి అవకాశాలు దక్కుతున్న సమయంలోనే ఈమె తమిళ్ మరియు హిందీ సినిమాల్లో నటించడంపై చాలా ఫోకస్ పెట్టింది. దానితో దాదాపు కొంత కాలం పాటే ఈ బ్యూటీ తెలుగు సినిమాలకు దూరంగా ఉంది.

కేవలం తమిళ్ , హిందీ సినిమాలు నటిస్తూ వచ్చింది. కానీ ఈమెకు తమిళ్ , హిందీ పరిశ్రమలో టాలీవుడ్ ఇండస్ట్రీ లో వచ్చిన స్థాయి గుర్తింపు రాలేదు. ఇక మళ్ళీ ఈమె తెలుగు సినిమాల్లో నటించడానికి ప్రస్తుతం ఆసక్తిని చూపిస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటీ సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొందిన తెలుసు కదా అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ప్రస్తుతం ఈ బ్యూటీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీ లో హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ కనుక మంచి విజయం సాధించినట్లయితే ఈమెకు మళ్ళీ తెలుగులో మంచి క్రేజ్ వచ్చే అవకాశం ఉంటుంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ తో రాశి ఖన్నా ఎలాంటి విజయాన్ని అందుకొని ఏ స్థాయి గుర్తింపును దక్కించుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rk