సినిమా ఇండస్ట్రీ లో కొంత మంది కి మంచి విజయాలు దక్కితేనే వరుస పెట్టి స్టార్ హీరోల సినిమాలలో , క్రేజీ మూవీలలో అవకాశాలు దక్కుతాయి. ఇక మరి కొంత మంది కి పెద్దగా విజయాలు లేకపోయినా వారు నటించిన సినిమాలలో తమ నటనతోను , అందం తోనో ప్రేక్షకులను ఆకట్టుకున్నట్లయితే వారికి మంచి గుర్తింపు రావడం , దానితో వారికి వరస పెట్టి స్టార్ హీరోల సినిమాలలో , క్రేజీ మూవీలలో అవకాశాలు దక్కడం జరుగుతూ వస్తుంది. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో ఓ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగిస్తుంది. ఆమెకు భారీ విజయాలు ఎక్కువగా లేకపోయినా ఆమె నటించిన సినిమాలో తన అందంతో , డాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈమెకు మంచి గుర్తింపు ఏర్పడింది. దానితో ఈమెకు వరుస పెట్టి స్టార్ హీరోల సినిమాలలో , క్రేజీ మూవీలలో అవకాశాలు దక్కుతున్నాయి.

ఇంతకు ఆ బ్యూటీ ఎవరు అనుకుంటున్నారా ..? ఆమె మరెవరో కాదు  శ్రీ లీల. ఈమె ఇప్పటివరకు తెలుగులో చాలా సినిమాలు చేసింది. అందులో ఒకటి , రెండు సినిమాలను మినహాయిస్తే ఈమెకు ఏ మూవీ ద్వారా కూడా గొప్ప విజయాలు దక్కలేదు. కానీ ఈమె నటించిన ప్రతి సినిమాలో కూడా తన అందాలతో , డ్యాన్స్ తో ప్రేక్షకులను కట్టి పడేస్తోంది. దానితో ఈమెకు వరుస పెట్టి సూపర్ సాలిడ్ క్రేజీ సినిమాలలో అవకాశాలు దక్కుతున్నాయి. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి శివ కార్తికేయన్ హీరోగా రూపొందుతున్న పరాశక్తి అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను వచ్చే సంవత్సరం జనవరి 14 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ గనుక మంచి విజయం సాధించినట్లయితే శ్రీ లీల కు కోలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ దక్కడం ఖాయం అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: