సినిమా ఇండస్ట్రీ లో ఎవరి కెరియర్ అయినా కూడా అద్భుతమైన స్థాయిలో ముందుకు సాగాలి అంటే వారికి విజయాలు అత్యంత ముఖ్యం. ఎవరికైనా అందం కాస్త తక్కువ ఉన్న , నటన గొప్ప స్థాయిలో చేసే స్కిల్స్ లేకపోయినా అద్భుతమైన విజయాలు ఉన్నట్లయితే వారు అదిరిపోయే రేంజ్ లో కెరియర్ను ముందుకు సాగిస్తూ ఉంటారు. అదే అందం , అభినయం , నటన అన్ని సూపర్ గా ఉన్న విజయాలు లేనట్లయితే వారికి అవకాశాలు ఉండవు అనే వాదనను అనేక మంది అనేక సార్లు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఇకపోతే తన నటనతో , అందాలతో ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో ఆకట్టుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన స్థాయికి చేరుకున్న నటి మనులలో రాశి కన్నా ఒకరు. ఈమె టాలీవుడ్ సినిమాల ద్వారా ఎన్నో విజయాలను అందుకునే అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఈమె ఈ మధ్య కాలంలో తెలుగు తో పాటు తమిళ , హిందీ సినిమాలలో నటించడానికి అత్యంత ఆసక్తిని చూపిస్తుంది. ఈమె చాలా కాలం గ్యాప్ తర్వాత తెలుగు లో తెలుసు కదా అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే విడుదల అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు.

మూవీ ద్వారా ఈమెకు అపజయం దక్కింది. ప్రస్తుతం ఈమె పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా గనుక మంచి విజయం సాధిస్తే ఈమె కెరియర్ మళ్ళీ తెలుగులో అద్భుతమైన స్థాయికి చేరుకుంటుంది అని , ఒక వేళ ఈ మూవీ కనుక బాక్సా ఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయితే రాశి ఖన్నా కెరియర్ కాస్త డేంజర్ లో పడే అవకాశం ఉంది అని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: