- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శ్రీలీల , రాశి ఖన్నా హీరోయిన్లు గా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా “ ఉస్తాద్ భగత్ సింగ్ ” పై ఏ స్థాయిలో అంచ‌నాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. ఈ యేడాది ప‌వ‌న్ ఇప్ప‌టికే ఫ్యాన్స్ కు రెండు అదిరిపోయే ట్రీట్ లు ఇచ్చారు. ముందుగా హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమా తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ప‌వ‌న్ .. ఆ త‌ర్వాత త‌క్కువ టైంలోనే సెప్టెంబ‌ర్ 25న ఓజీ సినిమా తో మ‌రోసారి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఓజీ అయితే ఫ్యాన్స్ కు పిచ్చ పిచ్చ‌గా న‌చ్చేసింది.. చాలా రోజుల త‌ర్వాత ప‌వ‌న్ అభిమానుల‌కు మంచి కిక్ ఇచ్చింది.


ఇక ఇప్పుడు ప‌వ‌న్ న‌టిస్తోన్న ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ మీదే అంద‌రి వెయిటింగ్ ఉంది. పైగా గ‌తంలో హ‌రీష్ శంక‌ర్ - ప‌వ‌న్ కాంబోలో వ‌చ్చిన గ‌బ్బ‌ర్‌సింగ్ సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ అవ్వ‌డంతో ఇప్పుడు ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ మీద అంచ‌నాలు మామూలుగా లేవు. మంచి హైప్ సెట్ చేసుకున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ఈ డిసెంబర్ లో రిలీజ్ అవుతుంద‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. ఈ సినిమా కోసం చూస్తున్న ఫ్యాన్స్ కి దర్శకుడు ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసేసారు.


ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఫుల్ జోష్ ఇచ్చే అప్డేట్ రాబోతుంది అని క్లారిటీ ఇచ్చేశారు. సో అది సాంగ్ కోసమే అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు అలాగే movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: