- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కొలాబరేషన్ లో యంగ్ స్టర్స్ తో కలసి  సరికొత్త హర్రర్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. కీర్తన్ నాదగౌడ దర్శకత్వంలో నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని  ప్రశాంత్ నీల్ సమర్పిస్తున్నారు. సూర్య రాజ్ వీరబత్తిని, హను రెడ్డి, ప్రీతి పగడాల ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. చిత్ర యూనిట్ సభ్యులు పూజకార్యక్రమంలో పాల్గొన్నారు. భయంతో కూడిన గ్రామంలోని మెడికల్ కాలేజ్‌లో నేపధ్యంలో ఈ సినిమా ఉండబోతోంది. సైన్స్– మిస్టరీ, సైన్స్, మూఢనమ్మకానికీ అర్ధం కాని ఒక సీక్రెట్ తో ఇప్పటివరకూ చూడని సరికొత్త కథతో ఈ చిత్రం ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వనుంది.  


ఈ చిత్రంలో శ్రీ వైష్ణవ, శశాంక్ పాటిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి దినేష్ దివాకరన్ డీవోపీ, వెంకీ జి.జి మ్యూజిక్ అందిస్తున్నారు.  మోహన్ బి.ఎస్ డైలాగ్స్ రాస్తున్నారు. అనిల్ యెర్నేని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఏదేమైనా ప్ర‌శాంత్ నీల్ - మైత్రీ కాంబినేష‌న్ అంటేనే ఓ క్రేజీ కాంబినేష‌న్ . మ‌రి ఇప్పుడు వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌స్తోన్న ఈ క్రేజీ ప్రాజెక్టు పై అటు క‌న్న‌డం లోనూ .. ఇటు తెలుగులో నూ మంచి అంచ‌నాలే ఉన్నాయి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: