టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా, దర్శకుడు మహేష్ బాబు రూపొందిస్తున్న అవైటెడ్ సినిమా “ ఆంధ్ర కింగ్ ” పై రోజురోజుకీ హైప్ పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు విడుదలైన ఫస్ట్ లుక్‌లు, టీజర్, పాటలు అన్నీ కలిసి సినిమాపై క్రేజ్‌ను మరింత పెంచాయి. రామ్ ఈసారి పూర్తిగా మాస్ అండ్ ఎనర్జిటిక్ అవతార్‌లో కనిపిస్తున్నాడని ఇండస్ట్రీ టాక్. ఇక హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే కూడా ఈ సినిమాతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపును సంపాదిస్తుందనే ప్రచారం సాగుతోంది.
ఇప్పుడు ఈ సినిమాపై లేటెస్ట్ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందుబాటులోకి వచ్చిన సమాచారం ప్రకారం “ ఆంధ్ర కింగ్ ” రన్‌టైమ్ 2 గంటల 45 నిమిషాలుగా ఫిక్స్ అయినట్లు ఇండస్ట్రీ సర్కిల్స్‌లో టాక్. అంటే ఇంటర్వెల్‌తో కలిపి దాదాపు 3 గంటలు పూర్తిగా మాస్, యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో నిండిపోనున్నాయన్నమాట. రామ్ సినిమాలకు సాధారణంగా పేస్ ఫాస్ట్‌గా ఉంటుంది కాబట్టి ఈ మూడు గంటలు కూడా బోర్ అనిపించకుండా సాగుతాయని ఫ్యాన్స్ ఆశలతో ఉన్నారు. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ బ్లాక్ చాలా స్ట్రాంగ్‌గా డిజైన్ చేసినట్లు కూడా టాక్ వినిపిస్తోంది.
ఈ సినిమాకు వివేక్ - మెర్విన్ మ్యూజిక్ అందించగా, ఇప్పటికే విడుదలైన సాంగ్స్ యూత్‌లో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. మాస్ బీట్స్‌తో పాటు స్లో మెలోడీస్ కూడా బాగున్నాయని సంగీత ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు. ఇక సినిమాను భారీ బడ్జెట్‌తో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ప్రొడక్షన్ విలువలు, టెక్నికల్ టీమ్, యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ “ఆంధ్ర కింగ్ ” ని ఈ ఏడాది అత్యంత ఆసక్తికర సినిమాల్లో ఒకటిగా నిలబెడుతున్నాయి. అంతే కాదు, రామ్ కెరీర్‌లో మళ్లీ బ్లాక్‌బస్టర్‌ను అందించే సినిమా ఇదే కావొచ్చని ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు చూడాలి మరి ఈ గట్టి రన్‌టైమ్‌తో “ ఆంధ్ర కింగ్ ” థియేటర్లలో ప్రేక్షకులను ఎంతవరకు ఎంటర్‌టైన్ చేస్తుందో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి