సినిమా ఇండస్ట్రీ లో కొంత మంది నటీమణులు హిట్టు , ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా అద్భుతమైన జోష్లో కెరీర్ను ముందుకు సాగిస్తూ ఉంటారు. అలాంటి వారిలో శ్రీ లీల కూడా ఒకరు. ఇప్పటివరకు ఈ బ్యూటీ చాలా సినిమాలలో నటించింది. అందులో చాలా తక్కువ సినిమాలతో మాత్రమే ఈమెకు విజయాలు దక్కాయి. కానీ ఈమెకు వరుస పెట్టి స్టార్ హీరోల సినిమాలలో, అద్భుతమైన క్రేజీ మూవీలలో అవకాశాలు దక్కుతున్నాయి. తాజాగా ఈమె మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన మాస్ జాతర అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే విడుదల అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా కూడా బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. అయినా కూడా ఈ బ్యూటీ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. వరుస పెట్టి ఈమెకు స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు దక్కుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే సంవత్సరం కూడా ఈ ముద్దుగుమ్మ అనేక సినిమాలతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీ లో హీరోయిన్గా నటిస్తోంది.

మూవీ పై తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సమ్మర్ లో విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ తో పాటు ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళ నటుడు శివ కార్తికేయన్ హీరోగా రూపొందుతున్న పరాశక్తి అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ ని కూడా వచ్చే సంవత్సరం విడుదల చేయనున్నారు. ఈ సినిమా మంచి విజయం సాధించినట్లయితే తమిళ సినీ పరిశ్రమలో ఈ బ్యూటీ కి అద్భుతమైన గుర్తింపు దక్కే అవకాశం ఉంటుంది. ఇలా ఈ బ్యూటీ కి హిట్టు , ఫ్లాపులతో సంబంధం లేకుండా అద్భుతమైన క్రేజీ సినిమాలలో అవకాశాలు దక్కుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: