తెలుగు ఇండస్ట్రీలో మెగాఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు అరడజను మంది ఉన్నారు..కానీ మెగాస్టార్ చిరంజీవి స్థాయిలో మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించిన హీరో ఒక్కరే అదే పవర్ స్టార్ పవన్ కళ్యాన్.  వాస్తవానికి పవన్ వచ్చిన కొత్తలో పెద్దగా విజయవంతమైన చిత్రాలు ఏవీ రాలేదు..కానీ ఎస్.జె.సూర్య దర్శకత్వంలో వచ్చిన ‘ఖుషి’ మంచి టర్నింగ్ పాయింట్ తీసుకు వచ్చింది. తర్వాత తమ్ముడు, జల్సా సినిమాలతో ఇండస్ట్రీలో మంచి క్రేజ్ రావడం మొదలైంది.  మరోవైపు చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లడంతో మెగా ఫ్యాన్స్ పవన్ పై అభిమానం పెంచుకోసాగారు.  
article data
ఇక గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది చిత్రాల తర్వాత పవన్ తెలుగు ఇండస్ట్రీల నెంబర్ వన్ హీరో రేస్ లోకి వెళ్లారు.  అంతే కాదు పవన్ అన్నయ్య మాదిరిగానే రాజకీయల్లో కూడా చురుకైన పాత్ర పోషించడంతో తెగులు రాష్ట్రాల ప్రజలకు మరింత చేరువ అయ్యారు.  ఓ వైపు సినిమా మరో వైపు రాజకీయాలు తన పాత్ర పోషిస్గున్నారు పవన్ కళ్యాన్.  తాజాగా డాలీ దర్శకత్వంలో పవన్ కళ్యాన్, శృతి హాసన్ జంటగా నటించిన ‘కాటమరాయుడు’ చిత్రం ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.  ఇప్పటికే ఈ చిత్రంపై విపరీతమైన అంచనాలు పెరిగిపోయాయి..గబ్బర్ సింగ్ డిజాస్టర్ తర్వాత పవన్ ఎంతో కసిగా చేసిన చిత్రం కావడం మరో విశేషం.  

అయితే డాలీ, పవన్ కాంబినేషన్ ఇప్పటికే ‘గోపాల గోపాల’ లో చూశాం..అంతే కాదు శృతిహాసన్, పవన్ కళ్యాన్ గబ్బర్ సింగ్ లో చూశాం..ఈ రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.  ఇప్పుడు ఇదే కాంబినేషన్ లో వచ్చిన ‘కాటమరాయుడు’ చిత్రంపై అనుకోకుండానే అంచనాలు పెరిగిపోతున్నాయి.  ఇక ఫస్ట్ లుక్స్, సాంగ్స్, ట్రైలర్ తో సోషల్ మీడియాలో దుమ్మురేపారు.    ఈ చిత్రం బెనిఫిట్ షోలు కొన్ని చోట్ల పడ్డాయి..అంతే కాదు ఓవర్సీస్ లో కూడా చిత్రంపై పలు కామెంట్లు వచ్చాయి.  కాటమరాయుడు చిత్రంలో పవన్ కళ్యాన్ చాలా డిఫరెంట్ గా మీసం,పంచెకట్టు, తెల్లని బట్టలతో చాలా ఫ్యాక్షన్ హీరోగా కనిపించాడట. అంతే కాదు మొదటిసారిగా నలుగు అన్నదమ్ములకు అన్నయ్యగా పెద్దరికంగా నటించాడట.

ఆడవాళ్లంటే ఆమడదూరం పారిపోయే కాటమరాయుడు ని ఆయన తమ్ముళ్లు ప్రేమలో ఎలా పడేలా చేస్తారు..హీరోయిన్ చుట్టు ఉన్న సమస్యలను తన సమ్యలుగా భావించిన కాటమరాయుడు విలన్లతో ఎలా పోరాడుతాడు అన్న అంశంతో చిత్రం నడుస్తుందట. అయితే హీరోగా పవన్ కళ్యాన్ చాలా అద్భుతమైన నటన ప్రదర్శించడమే కాకుండా మంచి కామెడీతో పాటు అదిరిపోయే ఫైట్స్ తో అభిమానులను ఆకట్టుకున్నాడట.  ఇక తమ్ముళ్లుగా నటించిన బాలాజీ, అజయ్, కామరాజు, చైతన్యలు చాలా అద్బుతంగా నటించారట..అన్నయ్యకు ఎదురు చెప్పకుండా అన్నయ్య మనసు నొప్పించకుండా ఎంతో హుందాగా నటించారట.  
Image result for katamarayudu movie stills
ఇక అందాల భామ శృతిహాసన్ విషయానికి వస్తే..ఇప్పటికే పవన్ తో నటించిన అనుభవం ఉండటంతో..వీరిద్దరి కెమిస్ట్రీ బాగా వర్క్ ఔట్ అయ్యిందట.  శృతి తండ్రిగా నాజర్ కూడా చాలా బాగా నటించాడు. ఇక ఆలీ, ఫృధ్విల కామెడీ చాలా బాగా పండిందట. విలన్ గా నటించిన తరుణ్ అరోరా కూడా బాగానే ఆకట్టుకున్నాడు. ఇక మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు.  సినిమాలో ఇంట్రవెల్ ముందు వచ్చే ట్రైన్ ఫైట్, క్లయిమాక్స్ లో వచ్చే ఎమోషన్స్, ఫైట్ సినిమాకే పెద్ద హైలెట్ గా నిలిచాయట.  
Image result for katamarayudu movie stills
ఏది ఏమైనా పవన్ కళ్యాన్ మరో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారని అంటున్నారు..అయితే ఇది ఫ్యాన్స్ అంటున్న మాటే...సినిమా సామాన్య ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకోబోతారన్న విషయం సాయంత్రం వరకు తెలియబోతుంది. ఎందుకంటే ఆడియన్స్ ఇచ్చే తీర్పును బట్టే సినిమా కలెక్షన్లు ఉంటాయి. మరి కాటమరాయుడు హిట్టా..ఫట్టా అన్న విషయం సాయంత్రం వరకు తెలుస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: