వరస హిట్స్ తో దూసుకుపోతున్న విజయ్ దేవరకొండ మ్యానియాకు ‘నోటా’ చెక్ పెట్టడంతో వచ్చే వారం విడుదల కాబోతున్న ‘టాక్సీవాలా’ సక్సస్ విజయ్ కు అత్యంత కీలకంగా మారింది. ఈమధ్యకాలంలో విజయ్ దేవరకొండ పై నెగిటివ్ ప్రచారం చేసే యాంటీ ఫ్యాన్స్ కూడ బాగా పెరిగిపోతున్న నేపధ్యంలో వారంతా ‘టాక్సీవాలా’ రిజల్ట్ గురించి అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

ఇలాంటి పరిస్థుతులలో విజయ్ మళ్ళీ అల్లు అర్జున్ గోల్డెన్ లెగ్ సెంటిమెంట్ ను నమ్ముకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ‘టాక్సీవాలా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈనెల 11న హైదరాబాద్ లో జరగబోతున్నట్లు సమాచారం. ఈ ఫంక్షన్ కు అల్లు అర్జున్ అతిధిగా రాబోతున్నాడు. 
Taxiwala Latest Movie Stills
గతంలో ‘గీతగోవిందం’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు అతిధిగా అల్లు అర్జున్ వచ్చి విజయ్ దేవరకొండ పై ప్రసంసలు కురిపించిన విషయం తెలిసిందే. తిరిగి ఇప్పుడు అదే సెంటిమెంట్ ను ప్రయోగిస్తూ ‘టాక్సీ వాలా’ ను హిట్ చేయడానికి ఈసినిమా నిర్మాతలలో ఒకరైన అల్లు అరవింద్ బన్నీ సెంటిమెంట్ ను మళ్ళీ బయటకు తీస్తున్నాడు. 
Vijay Deverakonda hints about taxiwala movie
ఈవారం దీపావళికి విడుదలైన ‘సర్కార్’ థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’ ‘అదుగో’ సినిమాలలో ఏసినిమా కూడ సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని నేపధ్యంలో దీపావళి సినిమాలు అన్నీ అంతంతమాత్రంగానే మారిపోయాయి. దీనితో వచ్చేవారం విడుదల కాబోతున్న ‘టాక్సీవాలా’ కు అన్ని విషయాలు కలిసి వస్తున్నాయి. విజయ్ మ్యానియాకు బన్నీ సెంటిమెంట్ తోడైతే మళ్ళీ ‘గీత గోవిందం’ సక్సస్ రిపీట్ అవుతుందని ఈమూవీ నిర్మాతలు చేస్తున్న ప్రయత్నాలకు ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: